ఆదిబట్ల లో అమానుషం తండ్రిని హత్య చేసిన తనయుడు

మత్తు మనిషిని చిత్తు చేస్తోంది. విశక్షణ కోల్పోయి కన్నవారిని సైతం కడతేర్చేలా చేస్తోంది.డ్రగ్స్ కు బానిసగా మారిన ఓ కుమారుడు ఉన్మాదిగా మారాడు. మందలించిన పాపానికి కన్న తండ్రిని కడతేర్చాడు కసాయి కొడుకు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్క యాంజల్ లోని ఆరెంజ్ అవెన్యూ లో ఈ ఘటన జరిగింది.తండ్రి రవీందర్(65) కొడుకు వ్యసనాలకు బానిసగా మారడంతో వేదనకు గురయ్యాడు.తనయుడులో మార్పుకోసం పరితపించాడు.మారాలని అడిగినందుకుపెట్రోల్ పోసి నిప్పు పట్టించడతోమంటలను తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందారు.రవీందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆర్దికంగా స్టిరాపడ్డాడు. తన భార్య సుధా తో పాటు ఇద్దరు కొడుకులు అనురాగ్, అభిషేక్ లతో కలిసి ఉంటున్నాడు వీరి పెద్ద కొడుకు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు… చిన్న కొడుకు  డిగ్రీ చదువుతున్నాడు.హత్య చేసిన కుమారుడు కోసం  పోలీసులు.గాలిస్తున్నారు.

తరుచూ గొడవ

పెద్దకొడుకు అనురాగ్ మత్తు పదార్థాలకు అలవాటు పడి తరచూ ఇంట్లో వాళ్ళతో గొడవ పడేవాడు. తల్లి దండ్రులతో పాటు తమ్ముడు అభిషేక్ తో గొడవ పడేవాడని స్థానికులు చెప్పారు
ఈ క్రమం లో గురువారం మధ్యాహ్నం తల్లిని ఓ ఇంట్లో గదిలో ఉండగా తాళం పెట్టిన అనురాగ్ తండ్రితో గొడవ పడ్డాడు.ఈ క్రమంలో తండ్రిపై పెట్రోల్ పొసేందుకు పదయత్నించగా భయాంటో తండ్రి  రవీందర్ బయటకు పరుగులు తీసాడు.అతడిని వెంబదించిన అనురాగ్ ఇంటికి కొద్దీ దూరంలో తండ్రి పై పెట్రోలు పోసాడు. వెంటనే నిప్పు అంటించాడు.సమాచారం తెలుసుకున్న అదిబట్ల ఇన్స్పెక్టర్  రాఘవేందర్ రెడ్డి ఘటనా స్థలానికి  చేరుకొని విచారిచ్చారు.క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు.మృతుని .భార్య సుధా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *