సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పోర్టికో భాగం కుప్ప కూలిపోయింది.శిథిలాలా కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుని తీవ్ర గాయాలకు గురయ్యారు.మరో ఏడుగురు స్వల్పకాలే గాయాలతో బయటపడ్డారు.వారందరికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వర్సిటీ లోపలకి మీడియాను అనుమతించకపోవడంతో సెక్యూరిటీ తో వాగ్వివాదం చోటుచేసుకుంది. భవనం స్లాబ్ కూలే సమయంలో పన్నెండు మంది వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది.అందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిన స్లాబ్ పోర్టికో భాగం శిథిల్లో ఎవరైనా చిక్కుకున్నారనే అనుమానంతో జేసీబీ సహాయంతో శిథిలాలు తొలగిస్తున్నారు.భవనం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే కూలిపోయినట్లు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.నిర్మాణంలో ప్రమాణాల పాటించిన కాంట్రాక్ట్ పై ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు ఉమేష్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. తీవ్ర గాయాలకు గురైన కార్మికులను ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.భవనం స్లాబ్ కూలే సమయంలో 12 మంది వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది.గాయాలకు గురైనా సంజయ్, కరణ్, ఈశ్వర్, దేనా, యునాస్, మాధవ్, మనోజ్ లు ఉన్నారు.