500 కోట్ల భూ కుంభకోణంలో బినామీలుగా ఉన్న అధికారులకు ప్రమోషన్లు

 

గచ్చిబౌలి డివిజన్ నానక్ రామ్ గూడ సర్వేనెంబర్ 149 లో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి పరాయి వ్యక్తులకు కట్టబెట్టిన వ్యక్తులపై ఇంతవరకు చర్యలు తీసుకోకోలేదు. రూ 500 కోట్లు విలువ చేసే ఆరు ఎకరాలస్థలాన్ని జీవో నెంబర్ 59 కింద అక్రమంగా రెగ్యులరైజ్ చేసిన అధికారులను కాపాడుతున్న శక్తులపై సర్వత్ర చర్చ జరుగుతోంది. కోట్లు దోచుకున్న అధికారులపైఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు దారితీస్తుంది. 125 గజాల మించకుండా నివాసం ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకి జీ ఓ 59 కింద రెగ్యులర్ చేయాల్సి ఉంది.నానక్ రాంగూడలోవందలాది గజాల స్థలాన్ని ఒక్కోవ్యక్తి పేరు మీద రెగ్యులర్ చేశారు. వెను వెంటనే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేశారు.ఈ మొత్తం వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.59 జీఓ ని దుర్వినియోగం చేసిన అధికారులపై భూ కుంభకోణం వెనుకున్న సూత్రధారులు, పాత్రధారులను ప్రభుత్వం మారిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందులో ప్రధాన సూత్రధారులు ఎవరనేది తెలిసిన చర్యలు తీసుకోవడంలో మీనమేశాలు లెక్కిస్తున్నారు.ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఈ తథాంగం పూర్తి చేశారు. రెగ్యులరైజ్ చేసిన కొన్ని గంటల్లోనే నిర్మాణ సంస్థల పేరిట రిజిస్ట్రేషన్ చేసి బడా బాబులకు భూమి బదులాయించారు.అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్ని ఆధారాలతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిన కలిసి పిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్లు రద్దుచేసి భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నమని చెప్పినా భారీ భూ కుంభకోణం చేసి 59 జీ ఓ ను దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులను ఇంత వరకు శిక్షించలేదు.అధికారులు,బ్రోకర్లు,తెరవెనుక సూత్రధారులు కోట్ల రూపాయలు స్వాహా చేశారు.

జిఓ 59 దుర్వినియోగం చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.చల్లా శోభన్

59 జీవోతో ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం నాయకులు చల్ల శోభన్ డిమాండ్ చేశారు.సిపిఎం నాయకులు కొంగరి కృష్ణ, మాణిక్యం, ఎన్ వరుణ్ తదితరులుఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ అధికారులు ల్యాండ్ బ్రోకర్ తో కుమ్మక్కై 59 జీవోను దుర్వినియోగం చేసి అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కాజేసిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఇక్కడ గజం భూమి సుమారు రెండు లక్షలు విలువ చేస్తుంది. నామమాత్రపు ధరకే రెగ్యులరై చేస్తే ఉన్నతాధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కుంభకోణం లో అధికారుల బినామీగా ఉండి మొత్తం వ్యవహారం నడిపించారని దర్యాప్తులో తేలిన ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు .ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు లక్షల రూపాయలు వేతనాలుగా తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు బ్రోకర్ల మారి దోచుకోవడం అత్యంత నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ వ్యవస్థలు అవినీతిలో కూరుకు పోతుంటే సరిదిద్దాల్సిన ప్రభుత్వం వ్యవస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అక్రమంగా రెగ్యులరైజ్ చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాకపోతే ఆందోళనలు నిర్వహిస్తామనిసిపిఎం నాయకులు చల్ల శోభన్ హెచ్చరించారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *