చందానగర్ ఖజానా జ్యువెలరీలో పట్టపగలు భారీ దోపిడీకి దొంగలు తెగబడ్డారు దుకాణం లోకి ప్రవేశించి రివాల్వర్ తో బెదిరించారు.మరికొంత మంది మారణాయుధాలతో దర్జాగా బంగారం దుకాణంలోకి చొరబడ్డారు.ఉదయం సుమారు 10.40 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది.ఆ సమయంలో 30 మంది వరకు సిబ్బంది విధులకు హాజరయ్యారు.అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న దోపిడీ దొంగలు ఉద్యోగులు ఎవరిపని లో వారు సంసిద్ధం అవుతున్న సమయంలో మారణాయుధాలతో దుండగులు స్వైరవిహారం చేశారు.ఈ ఘటనలో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు.వచ్చిన వారు హిందీలో మాట్లాడుతూ మేనేజర్ ను నేరుగా తుపాకీ గురిపెట్టి లాకర్ తెరవమని చెప్పడంతో తన వద్ద రెండో తాళం లేదని చెప్పడంతో కాల్పులు జరిపారు.తూటా కాలుÐ తొడలోకి దూసుకువెళ్ళింది.ఈ సమయంలోనే కొంత మహిళా ఉద్యోగుల ప్రతిఘటనతో వారిపైన దాడికి పాల్పడ్డారు.దోపిడీ చేసేందుకు సుమారు 8 నుండి 10 మంది దొంగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మేనేజర్ కీ మర్చిపోవడమే మేలు చేసిందా?
షో రూమ్ లో బంగారం భద్రపరిచే లాకర్ తెరవాలంటే ఇద్దరు మేనేజర్లు తమ వద్ద ఉన్న తాళం చెవులు తో తెరిస్తేనే లాకర్ తెరుచుకుంటుంది.మేనేజర్ ఇంటి వద్ద తాళం చెవి మర్చిపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లాడు.దీంతో లాకర్ తెరవడానికి ఆలస్యం అయింది….అదే సమయంలో దుండగులు దుకాణంలోకి చొరబడ్డారు.లాకర్ తెరవాలంటూ బెదిరించారు.తాళం చెవి లేకపోవడంతో, దుండగులు ఆగ్రహానికి గురై దుకాణంలోని కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు..అలాగే, మహిళా ఉద్యోగులపై దాడికి దిగి వారిని బెదిరించారు.నేరుగా తుపాకీ గురిపెట్టి డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ పై కాల్పులు జరిపారు.ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం లేదు…దోపిడీ యత్నం విఫలం కావడంతో దుండగులు బయట ఉన్న సిల్వర్ జ్యువెలరీని తీసుకొని రెండు బైకులపై పారిపోయారు
ఆ నగలు దుకాణాన్నే ఎందుకు టార్గెట్ చేశారు
చందానగర్ మదీనాగూడలో ఐదు పేరుమోసిన బంగారు దుకాణాలు ఉన్న దోపిడీ దొంగలు ఖజానా జ్యువెలరీ దుకాణం ఎంచుకోవడం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.ముందస్తుగా రెక్కీ నిర్వహించారు.ఎనిమిది మంది సభ్యులుగల ముఠా దోపిడీకి రావడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. సెక్యూరిటీ వ్యవస్థ అంతా చెక్ చేసిన తర్వాత దొంగలు నగలు దుకాణంలోకి చొరబడ్డారు.సెక్యూరుటి పహారా లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు.
దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి చెప్పారు.దుండగులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అనే వివరాలు సేకరిస్తున్నాం….విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం.దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం.