
- సెంట్రల్ యూనివర్సిటీలో హైటెక్ మాస్ కాపీయింగ్
- నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తూ పట్టుబడ్డ నిందితులు
- ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు
- కాపీయింగ్ కు పాల్పడిన పరికరాలు స్వాధీనం
- హైదరాబాద్ : విశాల జ్యోతి ప్రతినిధి
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెక్ మాస్ కాపీయింగ్ కలకలం రేపింది.యూనివర్సిటీలో నాన్-టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్’ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిందితులు హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ (30)అతనికి సహకరించిన సతీష్ అనే మరో యువకుడును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.అనిల్ కుమార్ పరీక్ష రాస్తూ తరచూ బాత్రూమ్‌కు వెళ్తుండటంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి తనిఖీ చేశారు.తనిఖీలో అతని బ్లూటూత్, చొక్కా కాలర్‌కు చిన్నపాటి సెన్సార్, చొక్కా లోపల టేప్‌తో అతికించిన ఎలక్ట్రానిక్ పరికరాలు దొరికాయి.అతను ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి బయట ఉన్న సతీష్‌కు పంపించాడు. అక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సమాధానాలను బ్లూటూత్ ద్వారా వింటూ పరీక్ష రాస్తున్నట్లు గుర్తించారు.రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న పరికరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.