- రాజా సాబ్ సినిమా దర్శకుడుకి షాకిచ్చిన ప్రభాస్
- ఆభిమానులు
- మారుతి ఇంటికి వరస డెలివరీ ఆర్డర్స్
- క్యాష్ ఆన్ డెలివరీ తో అభిమానులు బుకింగ్
- సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారిన డెలివరీ
- రిలిజ్ టైంలో డైరెక్టర్ మారుతి ప్రకటనకు నిరసన
- సినిమా బాగ అడకపోతే అభిమానులు తన ఇంటికి రావోచ్చని ఇదివరకే ప్రకటన
హైద్రాబాద్: విశాల జ్యోతి

ప్రముఖ హిరో ప్రబాస్ తో రాజాసాబ్ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు మారుతికి ప్రభాస్ అభిమానులు షాకిచ్చారు.కొండాపూర్ కొల్ల లగ్జరీ విల్లా లో నివాసం ఉంటున్న దర్శకుడు మారుతి ఇంటికి 100కు పై డెలివరీ ఆర్డర్ లు రావడంతో మారుతి కంగుతున్నాడు. వరుసగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆర్డర్లు వస్తుండడంతో విస్మయానికి గురయ్యాడు.దర్శకుని ఇంటి నంబర్ పై జుమోటో,స్విగ్గి,ఫుడ్ డెలివరీ,అమెజాన్,ఆర్డర్లు పంపుతున్న గుర్తుతెలియని వ్యక్తులు..ప్రతి ఒక్క ఆర్డర్ క్యాష్ ఆన్ డెలివరీ పంపుతూ ప్రభాస్ అభిమానులు కొత్త తరహా నిరసనకు శ్రీకారం చుట్టారు.వరసగా డెలివరీలు వస్తుండడంతోసెక్యూరిటీ గార్డ్ లకు తలనొప్పిగా మారింది.ఆర్డర్స్ డెలివరీ అయిన విల్లాకి ఫోన్ చేసి అడగగా నేను ఎలాంటి డెలివరీలు చేయలేదని దర్శకుడు మారుతి తెలపడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.రాజాసాబ్ మువి రిలిజ్ టైంలో సినిమా బాగ అడకపోతే అభిమానులు తన ఇంటికి రావోచ్చని మీడియా వేదిక ద్వారా ఇంటి అడ్రస్ ప్రకటించారు.దర్శకుడు మారుతి.రాజాసాబ్ సినిమా బాగా ఆడక పోవడంతో ప్రభాస్ అభిమానులు గురువుగా ఉన్నారు.ఈ అసంతృప్తితో మారుతి ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పంపుతున్న వారు ప్రభాస్ అభిమానులుగా నిర్ధారించారు.చేసేది ఏమీ లేక దర్శకుడు ఆగ్రహంతో నా పేరు మీద ఏది వచ్చిన లోపలికి పంపకండి అని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనేక రకాల నిరసనలు చూసాం.ఈ తరహా అభిమానుల నిరసన చర్చనీయాంశం అయ్యింది.ఎవరైనా మాట్లాడితే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అతివిశ్వాసంతో ఏది పడితే అది మాట్లాడితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ర డైరెక్టర్ మారుతి కి వంట పట్టినట్లు ఉది. అభిమానులకు ప్రేమ ఉంటే ఆకాశానికి ఎత్తేస్తారు కోపం వస్తే మరో రకంగా ఉంటుందని తాజా ఘటన మరోసారి రుజువు అయ్యింది. సెలబ్రిటీలు మాట్లాడితే ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే మంచిదని అంటూన్నారు.