
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల వెనుక ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ధన దాహం దాగిఉంది. అయ్యప్ప సొసైటీలో భవనాలు నిర్మించాలంటే పునాది దశలోనే టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించాలీ. ఒక్కో స్లాబుకు విస్తీర్ణం బట్టి రెండు లక్షల పైబడి చెల్లించుకోవాలి. ఒక్కో బిల్డర్ ఇక్కడ రోడ్లు ఆక్రమించి భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఆరు,ఏడు అంతస్తుల నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు.విచ్చలవిడిగా బ్లాక్ మనీ చాలమాణి అవుతుంది. అధికారుల జేబులు నిండుతున్నాయి. ఈ అవినీతిలో కింద నుండి పై స్థాయి అధికారుల వరకు భాగస్వాములుగా ఉన్నారు.ఆరు ఏడు భవనాలు చొప్పున్న నిర్మిస్తే సుమారుగా కోటి రూపాయల లంచల పేరుతో చెల్లించిన బిల్డర్లు ఉన్నారు. లేదంటే ఏదో ఒక వంకతో కూల్చివేతలు చేస్తారు. ఇలా అధికారులు,,అక్రమ నిర్మాణదారులు కుమ్మక్కై హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి యదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొంతమంది బ్లాక్ మెయిల్ చేసే లీడర్లు,నకిలి జర్నలిస్ట్ లు ఫిర్యాదు చేశారనే నెపంతో నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత అయినా అక్రమ కట్టడాల నిర్మాణం పనులు ఆగిపోతాయనుకుంటే పొరపాటే. కూల్చివేతలు చేపట్టిన మరసటి రోజే బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో కూల్చివేతల లక్ష్యం నెరవేరడం లేదు. కూల్చివేతలు చేస్తున్నట్లు లక్షల బిల్లులు రికవరీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. కాంట్రాక్టర్ కు పెంచిపోసిస్తూ అధికారులు మరింత లాభపడుతున్నారు.