మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై ఘోరం

ట్రాఫిక్ రద్దీగా ఉండే కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగడం ప్రాణాంతకంగా మారుతుంది. ఇందుకోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి.కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయ.మాదాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12.30 గంట సమయంలో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై
ఈ ఘటన జరిగింది.

హిట్ అండ్ రన్ ఘటన సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి.కేబుల్ బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరు యువకులు అనిల్,అజయ్ లను వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. అనిల్ శరీరం పై నుంచి కారు దూసుకుపోయింది. మరో వ్యక్తి అజయ్ స్వల్ప గాయాలయ్యాయి.ఈ ఘటనలో అనిల్ ను పోలీస్ వాహణంలోనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారు నెంబర్ ఏపీ 28 డి వి 7999 ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని వెంకట్ రెడ్డి వద్ద కారు తీసుకొని నడిపించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడిపించారా లేదా రక్త నమూనాలు పరీక్షించిన తర్వాతే తెలుస్తుందని ఇన్స్పెక్టర్ మల్లేష్ చెప్పారు

కేబుల్ బ్రిడ్జి పై సెల్ఫీలు వద్దు: ఇన్స్పెక్టర్ మల్లేష్

కేబుల్ బ్రిడ్జి పై సెల్ఫీలు నిషేదించినట్లు ఇన్స్పెక్టర్ మల్లేష్ చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జి వంతెన పై నడిరోడ్డు మీద వాహనాలు నిలిపి ఉంచడం, సెల్ఫీలు దిగడం పూర్తిగా నిషేదించాం. ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జి వంతెనకు ఇరువైపులా ఉన్న గోడ ఎత్తు పెంచాలని జిహెచ్ఎంసి అధికారులకు కోరామన్నారు. ఎత్తు పెంచడం వలన బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యలు నివారించడంతోపాటు సెల్ఫీలు తీసుకునే సమస్య తీరుతుందని అన్నారు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతుంది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడతామని ఇన్స్పెక్టర్ వివరించారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *