జీడి పంట రైతులకు ఈ ఏడాది తీవ్ర నిరాశ మిగిలింది. జీడి సాగుపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం, విచ్చలవిడిగా రసాయనాలు పిచికారి చేయడం, వర్షాభావ పరిస్థితులు వెరసి జీడి పంట దిగుబడి దిగజారి పోయింది.లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేసే రైతులకు అప్పులే మిగిలాయి. సకాలంలో సరైన వర్షపాతం ఉంటే జీడిపువ్వు చిగురించే అవకాశం ఉంటుంది.పూత దశలో మిత్ర పురుగులు సహాయకారిగా ఉంటాయి.ఈ దశలో మోతాదుకు మించి రసాయనాలు వాడడంతో పలధీకరణ చెందే సైక్లింగ్ ఆగిపోతుంది.ఈ ఏడది చెట్టుకు చిగురే అసలు రాలేదు.దీంతో పూత ఆగిపోయింది.అక్టోబర్, నవంబర్ నెలలోనే చిగురు రావాలి.ఈ ఏడాది చిగురు రాలేదు. వర్షాలు సక్రమంగా ఉంటే భూమిలో ఉన్న సారం చెట్టుకు చేరి చిగురుస్తుంది. నవంబర్ లో వచ్చే పూత కంటే జనవరిలో వచ్చే పూతకి ఎక్కువ దిగుబడి ఉంటుంది.పూత నెలున్నరాలస్యంగా మార్చి చివరి వారంలో ప్రారంభమైంది.దసరా టైంలో వర్షాలు జీడి పంటకి కొంత మేలు జరిగేదని పలాస హార్టికల్చర్ అఫిసర్ చీడిపల్లి శంకర్ దాసు వివరించారు.
వర్షాభావ పరిస్థితులు నెలకొంటే..
వర్షాభావ పరిస్థితులు అదిగమించేందుకు ప్రత్యేక పద్ధతులు అవలంబించాలి..150 లీటర్ల డ్రమ్ములో400గ్రాముల యూరియా కలపాలి.19.19.19.ఎరువు డ్రమ్ము నీటిలో కలిపి చెట్లకు పిచికారీ చెయ్యాలి. పువ్వు విచ్చుకొని పిక్క దశలో ఎలాంటి రసాయనాలు పిచికారి చేయకూడదు. ఇలా చేయడం వల్ల పిక్కలు ఏర్పడడానికి సహాయకారిగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. ఈ మిత్ర పురుగులు ఒక పువ్వు నుండి మరో పువ్వుకి అలదీకరణ చేస్తాయి. పువ్వు వికసించి పిక్క కట్టే దశలో రసాయనాలు వాడితే పంట దిగుబడికి ప్రమాదం ఏర్పడుతుంది.ఉదయం 11 గంటల లోపు ఎలాంటి రసాయనాలు పిచికారి చేయకూడదు. ఇలా చేస్తే పిక్క కట్టడానికి ఉపయోగపడే పురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. తేరిటీగలు, కందిరీగలు,ఎర్ర చీమలు తదితర మిత్ర పురుగులు అంతరిస్తే జీడిపంటకే పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. జీడి పువ్వు తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల లోపు విచ్చుకుంటుంది. ఈ సమయంలోనే పువ్వు ఫలదీకరణ చెందడానికి సరైన సమయం. ఆ సమయంలో ఎట్టి పరిస్థితులలో రసాయనాలు ఫిచికారి చేయకూడదు. ప్రతి రెండు, మూడేళ్లకోసారి చెట్ల కొమ్మలు భూమికి తాకాకుండా కటింగ్ చేయాలి. ఇలా చేయడం వలన గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా చేస్తుంది
అగ్రికల్చర్ సహాయకులు కీలకం
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ సహాయకులను నియమించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం,చీడపురుగుల నివారణ పట్ల రైతులుకు అవగాహన కలిగించేందుకు అగ్రికల్చర్ అసిస్టెంట్ సహాయకారిగా ఉండాలి. మండలంలో 30 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు.వీరంతా ఫీల్డ్ కు వెళ్లి రైతులకు పంటల సంరక్షణ పట్ల అవగాహన కల్పించాలి.కానీ ఆ విధంగా చేయడం లేదు. జీడిమామిడి తోటలను మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు గల కోస్తా తీరప్రాంతంలో 1లక్ష 82వేల హెక్టర్ల లో పండిస్తున్నారు. గింజల ఉత్పత్తి 1.12 లక్షల టన్నులు, ఉత్పాదకత అధిక సాంద్రతలో తోటను పెంచుట ద్వారా హెక్టారుకు 2వేల కిలోల ముడి గింజల ఉత్పాదకత పొందవచ్చును.జీడి తోటలకు ఎక్కువ ఉష్ణోగ్రత, వెలుతురుతో పాటు వాతావరణంలో ఎక్కువ తేమ అవసరం జీడిమామిడిని కాండము వేరు తొలుచు పురుగు, లేత చిగురును ఆశించే దోమ, అతి ముఖ్యమైన చీడపురుగులు, ఇవే కాకుండా పూతకి గూడు కట్టు పురుగు, ఆకుముడుత పురుగు, కొమ్మ తొలిచే పురుగు, కాయ గింజ తినే పురుగు, తామర పురుగులు మొదలైనవి.రకాల గింజలు మధ్యస్తంగాను, లావుగాను వుండుట వలన ఎగుమతికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. బి.పి.పి.2, వి.ఆర్.ఐ.-2 బి.పి.పి.-4 గింజలు చిన్నవిగా ఉండి అధిక దిగుబడి గుత్తికాపు రకాలు. మొదటిగా కాపు వచ్చే, అధిక దిగుబడి నిచ్చే గింజ సైజు పెద్దదిగా ఉండి రెండు లేక మూడు రకాల అంటు మొక్కలను మాత్రమే కలిపి రైతులు నాటుకోవాలి.
అంతర పంటలతో మేలు
మొక్కలలో బంతి, చేమంతి,నేల పనస జీడి చెట్ల మధ్య గల స్థలంలో నాటుకోవచ్చు.వివిధ కూరగాయలు, మల్లెపూవు తోటలను, అనాసపళ్ళ, పొగాకు నారుమడి, మిరప, వేరుశనగ, పప్పు ధాన్యాలను అంతరపంటలుగా పెంచి అధిక రాబడులను పొందవచ్చును.. ఆరోగ్యవంతమైన 4 నెలల మొక్క 10, 15 ఆకులు కలిగి ఉన్న నాణ్యమైన అంట్లను మాత్రమే పేరున్న నమ్మకమైన నర్సరీల నుండి ఎంపిక చేసి నాటుకోవాలి. అంటుమొక్కలకు మొదటి రెండు సంవత్సరములు నీటి వసతి తప్పనిసరి.మొక్కలకు వేసవి కాలంలో అధిక ఉష్నోగ్రతల నుండి రక్షణ కల్పించాలి.వర్షాకాలంలో మొదటి వర్షాలు పడిన తరువాత జూన్ -జులై నెలలో ఒకటిన్నర సంవత్సరముల వయస్సు కలిగిన అంటు మొక్కలను ఎకరాకు 80 మొక్కల చొప్పున 7X7 మీ.లేక 8X4 మీ. దూరంలో 1X1X1 మీ.సైజు గుంటల్లో నాటాలి.లేత తోటల్లో భూమికి మీటరు ఎత్తు వరకు ఉన్న క్రింది కొమ్మలను కత్తిరించి ఏపుగా వృత్తాకారంలో పెరిగేటట్లు చేయాలి. ముదురు తోటల్లో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జులై-ఆగష్టు మాసాల్లో ఎండుకొమ్మలు, భూమికి ఆనుకొని ఉన్న కొమ్మలు, ఇతర చెట్ల మీదకు పోయిన కొమ్మలు, నీడన ఉన్న కొమ్మలు మొదలగు వాటిని కత్తిరించటం వలన, శుభ్రంగా ఉంచడంతో బాటు మొక్కలకు తగినంత సూర్యరశ్మి వెలుతురు, గాలి సోకి కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది.పిందే, కాయ పెరిగే సమయంలో నీరు పెడితే కాయ, గింజ సైజు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ ద్వారా జీడిమామిడికి నీరిస్తే 60 శాతము వరకు నీటి అదా చేయవచ్చును.
తొలకరిలో భూమిని దున్ని కలుపు లేకుండా చేయాలి.
ఎంపిక చేయబడిన అంటు మొక్కలని నాటటానికి ముందుగా గుంటల్లో 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేప పిండి, 200 గ్రా సూపర్ ఫాస్ఫేట్ ను కలిపి వేయాలి. మొదటి సంవత్సరము మొక్కలకు సేంద్రియ ఎరువులను మాత్రమే ఇవ్వాలి. రెండవ సంవత్సరము నుండి సేంద్రియ ఎరువులతో (వేపపింది. పశువుల ఎరువు, కంపోస్టు ) పాటు సిఫార్సు చేసిన మోతాదులో రసాయనికి ఎరువులు వేయాలి. 6 సంవత్సరాల వయస్సున్న జీడి చెట్లకు 500 గ్రా నత్రజని (1100 గ్రా యూరియా) 125 గ్రా భాస్వరం (750 గ్రా సూపర్ పాస్పేట్) 125 గ్రా పోటాప్ (225 గ్రా మ్యురేట్ అఫ్ పోటాష్ ) ను ఇవ్వాలి. రసాయనిక ఎరువులను చెట్టు మొదలు నుండి 1 మీ లేక 1% మీటరు దూరంలో చుట్టూ 15 సెం.మీ వెడల్పు మరియు లోతుగా గొయ్య చేసి అందులో వేసి మట్టితో కప్పాలి. ఆకులు పూర్తిగా పసుపు రంగుకు మారగానే చెట్లను వెంటనే వేర్లతో సహా తీసివేసి వేర్లలో దాగి ఉన్న ప్యుపాలను చంపి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చెట్లు తొలగించిన గుంటల్లో ఎండిన చెత్త వేసి తగులబెట్టాలి.