చర్లపల్లి ఖైది కడుపునిండా ఇనపమేకులు

ఖైదీ కడుపులో ఇనుప మేకులు,బ్లేడు,ప్లాస్టిక్ టేపు ఉన్నట్లు వైద్యులు ఇండోస్కోపి పరీక్షలు జరిపి నిర్దారించారు. 21 ఏళ్ళ వయసున్న మహమ్మద్‌ సొహైల్‌ సంచలగూడఖైదీగా ఉన్నాడు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆసుపత్రి తరలిస్తే అక్కడి నుంచి తప్పించుకోవచ్చునని భారీ స్కెచ్ వేశాడు. జైలు పరిసరాలలో కనబడిన వస్తువులన్నీ మింగాడు.సొహైల్ ప్లాన్ వికటించి ప్రాణాలు మీదకు తెచ్చింది

.జైలులో రిమాండ్ ఖైదీ కడుపులో మేకులు లభ్యం కావడం కలకలం రేపుతోంది. కడుపు నొప్పి సమస్యతో గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా అక్కడి వైద్యులు పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పొట్టను స్కాన్ చేయగా 9 ఇనుప మొలలు బయట పడటం తోఖంగుతిన్నారు. వైద్యులు ఈ పరిస్థితి చూసి షాక్ అయ్యారు

నా భార్య కొట్టిన దెబ్బలకు తాళలేకపోతున్నా. నేను చచ్చిపోతా

.వైద్యుల కథనం ప్రకారం తీవ్ర కడుపు నోప్పితో వచ్చిన చర్లపల్లి ఖైదీ సొహైల్ ను గాంధీ కి తరలించారు.కడుపు నొప్పితో విలువలాడుతున్న అతని పరిస్థితిని చూసి కడుపు స్కాన్ చేశారు..అందులో ఇనున మొలలు ఉన్నట్లుగా గుర్తించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించి అపరేష్ చేసి 9 ఇనుప మొలలను భయటకు తీశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అసలు ఇనుప మేకులు ఎందుకు మింగాడు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *