చందానగర్ సర్కిల్లో తిష్ట వేసిన నకిలీ ఓసి తయారీ ముఠా

చందానగర్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం కేంద్రంగా నకిలీ ఆక్యుపన్సీ సర్టిఫికెట్లు తయారీ ముఠా రెచ్చిపోతోంది.ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టడమే కాకుండా దరఖాస్తుదారులను నిలువెల్లా దోపిడీ చేస్తూన్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ మొత్తం వ్యవహారం ఓ చిరుద్యోగి కనుసన్నుల్లో జరుగుతుండగా ఇందుకు ఉన్నత స్థాయి అధికారి టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. చందానగర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న చిరు ఉద్యోగి తన గడ్డాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న
వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాట్లు బాధితులు చెప్పారు.ఓసి
సర్టిఫికేట్ల ముద్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కు పోలిన విధంగా నకిలీ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ కోసం ఇతర వ్యక్తుల ఎన్ ఓ సి సర్టిఫికేట్ జత చేసి ఇస్తున్నారు. సంబంధిత యజమానులు నీటి,విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.ప్రత్యేక పరిస్థితులలో క్షుణ్ణంగా పరిశీలిస్తేనే తప్ప నకిలీ వ్యవహారం బయట పడకపోవడంతో ఆడింది ఆటగా తయారైంది. మధురానగర్ లో ఓ క్రిస్టియన్ మిషనరీస్ ప్రతినిధి భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనానికి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ ఆ చైన్ మాన్ సప్రదింపులు జరిపాడు.ఓసి కావాలంటే సుమారు పది లక్షల రూపాయలు చెల్లించుకోవలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఓసి ని తయారు చేసి ఇచ్చేందుకు కొంత గడువు కావాలన్నాడు. అనుకున్నట్లే ఓసి ముద్రించి దరఖాస్తు దారునికి ఇచ్చి తనకు రావాల్సిన పైకం తీసుకున్నాడు.తీరా సర్టిఫికెట్ పరిశీలిస్తే నకిలీదని తేలింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వేరే వ్యక్తుల వివరాలు నమోదు కావడంటిక్ కంగుతున్న దరఖాస్తుదారుడు సదరు అధికారిని ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం పై విజిలెన్స్,ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.కొండాపూర్ లో ఓ వ్యక్తిని ఈవిధంగా మోసాగించారు.ఐదేళ్లలో ఈ విధంగా సుమారు 35 నకిలీ సర్టిఫికెట్ జారీ చేసి సుమారు పది కోట్ల రూపాయలు వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.ఇందులో నిర్మాణం పూర్తికాకపోయిన ఓసి జారీ చేసి నిర్మాణదారులకు పూర్తిస్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇవి నిబంధనలు

రెండు వందల గజాలు పై బడిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలి అనుకోకొంటే మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది.. అనుమతులు జారీ చేసి కొంత స్థలాన్నిజిహెచ్ఎంసి మార్ట్ గేజ్ చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. సెట్ బ్యాక్ నిబంధనలు పాటించి ఇల్లు నిర్మించుకుంటే జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ధ్రువీకరించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. లేకపోతే ఓసి నిలిపివేస్తారు.దీనితోవిద్యుత్తు, నీటి బిల్లులు రెండింతలు చెల్లించాలి.నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణదారులు సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఆర్కిటెక్ట్ చేసిన తప్పిదాలతో నిర్మాణదారులు ఇబ్బందులు పాలవుతున్నారు. దీంతో ఇంటి నిర్మాణం పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందేందుకు వెళ్ళినప్పుడు అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. ఏం చేయాలో తోచక ఇందుకోసం ఎంతైనా లంచం ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఇలాంటివి వ్యక్తుల అవసరాలు తెలుసుకుంటున్న టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు వారితో భేరసారాలు నడుపుతున్నారు. ఆక్యుపెన్సివ్ సర్టిఫికెట్ కావాలంటే విస్తీర్ణం బట్టి ఏడు నుంచి 20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. వారందరికీ నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి ఇస్తున్నారు

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *