10,12 తరగతుల ఫలితాలలో నవోదయ ప్రభంజనం

సీబీఎస్ఈ పది,పన్నెండు తరగతుల బోర్డ్ పరీక్షలలో నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 2024 ఫిబ్రవరి,మార్చ్ నెలల్లో జరిగిన సిబీఎస్ఈ బోర్డ్ పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచింది.ఈ రీజియన్ లో 77 విద్యాలయాలు ఉండగా 75 విద్యాలయాలు పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి.ఇంటర్మీడియట్ లో 73 విద్యాలయాలలో విద్యార్ధులు హాజరు కాగా 72 విద్యాలయాలకు చెందిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు.పదవతరగతిలో 5577 విద్యార్ధులు హాజరు కాగా 99.94 శాతం తో 5574 విద్యార్ధులు ఉత్తీర్ణతనుసాధించారు. పన్నెండవ తరగతిలో 3357 విద్యార్ధులు హాజరు కాగా 99.96 శాతం తో 3556 విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.ఇందులో పదవతరగతిలో184 విద్యార్ధులు వందకు వంద మార్కులు పొందగా పన్నెండవ తరగతిలో 119 విద్యార్ధులు వందకు వంద మార్కులు సాధించారు.పదవతరగతిలో ఆదిలాబాద్88.89,కేరళలోని ఇడుక్కి- 88.15,పాలక్కా డ్ -87.98, కరీంనగర్- 85.91 విజయనగరం 85.78 శాతం పొంది హైదరాబాద్ రీజియన్ లో మొదటి అయిదుస్థానాల్లో నిలిచాయి.పన్నెండవ తరగతిలో ఇడుక్కి- 88.68, పతనం తిట్ట -88.6 ,పాలక్కాడ్ – 87.85, బెంగుళూర్ అర్బన్- 87.8, ఎర్నాకులం -87.73 శాతం పొంది హైదరాబాద్ రీజియన్ లో మొదటి అయిదుస్థానాల్లో నిలిచాయి.పదవతరగతిలో పాలక్కాడ్ విద్యార్ధి తేజస్ 99% ,కాసర్ గోడ్ విద్యార్ధి కె.వీ .అలకనంద 96.8% తో ,యానాం విద్యార్ధి యు.సునీత 98.4 %తో , కోజికోడ్ విద్యార్ధి అనీనా మనోజ్ 98.4 % తో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు.పన్నెండవ వతరగతి లో పాలక్కాడ్ కామర్స్ గ్రూప్ కు చెందిన విద్యార్ధి విపిన్ దాస్ 99.2% తో ,మల్లాపురం సైన్స్ గ్రూప్ కు చెందిన ధనుష్ 98.8 శాతంతో బెంగుళూర్ రూరల్ హ్యుమానిటీస్ గ్రూప్ కు చెందిన విద్యార్ధి మహాదేవి 93.8 శాతంతో మొదటి స్థానాల్లో నిలువగా , పదవతరగతిలో పాలక్కాడ్ విద్యార్ధి తేజస్ 99 శాతం తో మొదటి స్థానం లో నిలిచాడు.దేశం లో ఉన్న అన్ని నవోదయాలలో కెల్లా హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు గాను హైదరాబాద్ రీజియన్ డిప్యూటి కమీషనర్  గోపాల కృష్ణ విద్యార్ధులను,ఉపాధ్యాయులను అభినందించారు.

      హైదరాబాద్ రీజియన్ లొ     అత్యుత్తమ బోధన

1986 జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి భారత ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.జవహర్ నవోదయ విద్యాలయాలు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు బాల బాలికల సహ విద్యతో నడుస్త్తున్న ఆశ్రమ పాఠశాలలు.ప్రస్తుతం 27 రాష్ట్రాలలో 649 జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రపాలితప్రాంతాలలో 8 విస్తరించబడ్డాయి. నవోదయ విద్యాలయ సమితిలో హైదరాబాద్ , భోపాల్, చండీఘర్ ,జయపూర్, లక్నోపాట్నా,పూనే, షిల్లాంగ్ రీజియన్ లుఉన్నాయి.హైదరాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం 77 విద్యాలయాలు నడుస్తున్నాయి. ఈ ఎనిమిది రీజియన్ లలో హైదరాబాద్ రీజియన్ 2024 ఫిబ్రవరి ,మార్చ్ మాసాలలో జరిగిన
సిబీఎస్ఈ బోర్డ్ పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచింది.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *