అమెజాన్ ఉద్యోగుల బకాయిల దారిమల్లింపు:వ్యక్తి అరెస్ట్

 

 అమెజాన్ కంపెనీలో  ఉద్యోగుల జీతాలు చెల్లింపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి కటకటాల్లోకి వెళ్ళాడు.సైబరాబాద్‌ EOW పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేశారు. అతనుపై నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, ఛీటింగ్ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు EOW DCP కర్రోళ్ల ప్రసాద్ వివరించారు. అమెజాన్ ఉద్యోగుల ఫైనల్ సెటిల్‌మెంట్ బకాయి మొత్తాలను క్లియరింగ్ చేసే ముసుగులోఅమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ మాజీ సీనియర్ ఫైనాన్షియల్ పేరోల్ఆపరేషనల్ అనలిస్ట్ వెంకటేశ్వర్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్‌గూడ లో ఉన్న ప్రధాన కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్నారు.2016 నుంచి2023 మధ్య కాలంలో184 మంది మాజీ ఉద్యోగులలకు రావాల్సిన 3.2 కోట్ల బకాయిలు సొంత బంఫువుల ఖాతాలోకి మళ్లించాడు.అమెజాన్  లా ఎన్‌ఫోర్స్‌మెంట్ రెస్పాన్స్ నిపుణుడు  అంకుర్ శర్మ ఫిర్యాదుతో వెంకటేశ్వర్లు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.అమెజాన్ కంపిని లో విధులు నిర్వహించి బైటకు వెళ్లిపోయిన మాజీ ఉద్యోగుల తుది సెటిల్‌మెంట్ బకాయిలతో సహా Amazon కంపెనీ క్రియాశీల ఉద్యోగుల యొక్క ఎండ్ టు ఎండ్ పేరోల్ కార్యకలాపాలను ప్రాసెస్ చేయడం నిర్వహించడం వెంకటేశ్వర్లు ప్రధాన బాధ్యత. కానీ మెట్టు వెంకటేశ్వర్లు అతని సహచరులుతో కుట్ర పన్నారు.మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్‌మెంట్ బకాయి మొత్తాలను ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించారు.నకిలీ ఇమెయిల్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఫైల్‌లను సృష్టించి మళ్లించడానికి పథకం పన్నారు. మెట్టు వెంకటేశ్వర్లు అతని సహచరులు క్లెయిమ్ చేయని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను గుర్తించి, బ్యాంకు బదిలీకి సంబంధించిన వర్కింగ్ ఫైళ్లను గుర్తించి ఖాతానంబర్‌లను మార్చడం అతని సహచరుల బ్యాంక్ ఖాతా నంబర్‌లతో అప్‌డేట్ చేసాడు. 2016 నుండి 2023 వరకు ‘స్నేహితులు, బంధువుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.2 కోట్ల మొత్తాన్ని మళ్లించారు.184 ఉద్యోగుల కు చెందిన నగదు 50 బ్యాంకు ఖాతాల్లోకి  రూ. 3.2 కోట్లు మళ్లించినట్లు గుర్తించి పిర్యాదు చేశారు.అమెజాన్ కంపెనీ అంకుర్ శర్మ పిర్యాదు మేరకు 403, 408, 420, 467, 468, 471, 477-A, 201 r/w 120-B సెక్షన్ కింద  కేసు నమోదు చేసినట్లు  ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ప్రసాద్ తెలిపారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *