
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరపకపోవడం బాధాకరం. ఈ చర్య తల తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లు అవుతుందని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వైఖరిని ఖండిస్తూ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA)ఆధ్వర్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీ అధ్యక్షుడు వర్షం మల్లేశం మాట్లాడుతూ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎలాగైతే స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్లను అమలు చేస్తున్నారో అదే పద్ధతిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ తరహాలో తెలంగాణ విద్యార్థులకు వివిధ కోర్సుల్లో అడ్మిషన్ కొరకు డిప్రివెషన్ పాయింట్లను పెట్టాలని, తెలంగాణలోని వేరే జిల్లాల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాటిలైట్ క్యాంపస్ పెట్టాలని కోరారు. యూనివర్సిటీలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) కింద తెలంగాణ సాంఘిక సంస్కృతిక రాజకీయ ఆర్థిక అంశాల మీద జరిగిన అధ్యయనాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.