
మియాపూర్ లో బాలిక వసంత(12) మర్డర్ కేసులో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకొనే నిజాలు వెలుగులోకి వచ్చాయి.దారుణ ఘటన పోలీసులనే నివ్వుర పరిచింది.కన్న తండ్రి ప్రధాన సూత్రధారిగా తేల్చేసిన పోలీసులు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల ముమ్మరంగా దర్యాప్తు అనంతరం మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించిన వివరాలు మియాపూర్ ఏసీపీ నరసింహారావు వెల్లడించారు.బాలిక హత్యోదాంతం వివరాలు ఆయన మాటల్లోనే…వారం రోజుల వ్యవధిలోనే
బాలిక మిస్సింగ్ మిస్టరీ ఛేదించారు.
పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి బానోతు నరేష్…ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం…
తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు…
తన కోరిక తీర్చాలంటూ బాలిక పై ఒత్తిడి తెచ్చిన తండ్రి నరేష్…
అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హత మార్చిన తండ్రి నరేష్…
నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య…
బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుండి బయటకు వచ్చిన బాలిక తండ్రి నరేష్…
11 నిమిషాల వ్యవధిలోనే బాలిక ను హత్య చేసిన తండ్రి నరేష్…
అనంతరం అక్కడి నుండి బయటకు వచ్చిన నిందితుడు…
బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లిన నిందితుడు…
వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ వచ్చిన నిందితుడు…
తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేష్ దంపతులు…
వారం రోజుల పాటు అస్సలు విషయం దాచిన బాలిక తండ్రి నరేష్…
బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారణ…
స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా…
బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చిన నరేష్ దంపతులు…
వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేసిన తండ్రి నరేష్…
నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు…
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును
ఛేదించిన పోలీసులు…
నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మియాపూర్ పోలీసులు…
చెడు అలవాటుకు బానిస కావడంతో పాటు అశ్లీల వీడియోలు చూస్తూ కన్న కూతుర్నే కడతీర్చి జైలు పాలయ్యాడు.