రాయదుర్గంలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ

 

పేరుమోసిన జాబు పోర్టల్ నుంచి మీ వివరాలు తీసుకొని ఫోన్ చేస్తున్నట్లు నమ్మించారు. ఇంటర్వ్యూ చేశారు. సెలెక్ట్ అవుతున్నట్లు సమాచారం ఇచ్చారు. వంద రోజులు శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించినాలుగు లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకున్న 40వేలు శిక్షణ అనంతరం తిరిగి చెల్లిస్తామని నమ్మించారు. ఇదంతా నిజమేనా నమ్మిన నిరుద్యోగులు అప్పు చేసి డబ్బులు కట్టి నిలువెల్లా మోసపోయారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న కథనం ప్రకారం ….

రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న
రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న

గచ్చిబౌలి టెలికాం నగర్లో సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెని మోసానికి పాల్పడింది.శిక్షణా,ఉద్యోగ కల్పన పేరుతో నిరుద్యోగులదగ్గర డిపాజిట్ పేరుతో డబ్బులు వసూళ్లు చేసి బోర్డ్ తిప్పేసింది.ఒక్కొ వ్యక్తినుంచి 40 ,50వేలు చొప్పున్న సుమారు 5 కోట్లు ఫీజులు వసూలు చేశారు. బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెని పై బాదితులు పిర్యాదు చేశారు.టెలికం నగర్ కాలనిలో ఉన్నరైల్ వరల్డ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో బెంగుళూరుకు చెందిన ప్రకాష్ సింగ్ అనే వ్యక్తి కార్యక్రమం తెరిచాడు. బెంగుళూరు,పూణే,ముంబై, హైదరాబాద్ కేంద్రంగా మొత్తము ఐదు బ్రాంచ్ లు తెరిచారు.హైదరాబాద్ లో మే నెలలో బ్రాంచ్ ప్రారంభించారు.ఉద్యోగాలు ఇస్తామాంటూ నగరంలో 40 మంది దగ్గర 18 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసిన రైల్ వరల్డ్ ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు.గత మూడు నెలల నుంచి ఇతర నగరాలలో కూడాఒక్కో వ్యక్తీ నించి 40 చొప్పున్న వసూలు చేశారు.నాలుగు బ్రాంచ్ ల నుంచి సుమారు5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డు తిప్పేశారు.గత కొన్నిరోజుల నుంచి కార్యాలయం తెరవకపోవడంతో మోసపోయామని గ్రహించన బాదితులు
రాయ్ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *