
200 యూనిట్లు లోపు విద్యుత్తు వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలు బిల్లులు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టేటి రవిని కోరుతున్నట్లు విదసo ఐక్య వేదిక ( విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక) ఎపి స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ Dr బూసి వెంకట రావు చెప్పారు.ఎస్సి,ఎస్టీలు విద్యుత్ విద్యుత్ బిల్లులు చెల్లింపు అంశంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యుత్ శాఖ మంత్రి చొరవ చూపాలని కోరారు.ఎస్సి ఎస్టీ లకు 2014 కు ముందు నుండి అమలులో ఉన్న జన్ జీవన్ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం పునరుద్ధరించాలని విదసo ఐక్య వేదిక ( విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక) ఎపి స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ డా బూసి వెంకట్ రావు డిమాండ్ చేశారు.దళిత లబ్ధిదారులకు 200 యూనిట్ల లోపు వినియోగించే ఎస్సి లకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణ స్పందించాలని కోరారు.జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిన అన్యాయాలకు తగిన మూల్యం చెల్లించుకున్నారని గుర్తుంచుకోవాలన్నారు.27 సంక్షేమ పథకాల రద్దు,దళిత యువకుని డెడ్ బాడీ డోర్ డెలివరీ, కోడి కత్తి కేసు లో దళితుడు 5 ఏళ్ల జైలు నిర్భందం, తోట త్రిమూర్తులు శిరో మండనo తీర్పు, డాక్టర్ సుధాకర్ హత్య తదితర దుర్మార్గాలు భరించ లేక రాష్ర్టంలో దళితులందరు ఎస్సి ల ఉమ్మడి ప్రయోజనాల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడాo. జగన్ ను ఓడించాలని విదసం ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహించాము.ఫలితంగా టీడీపి కూటమి సంచలన విజయ శిఖరం అందుకుందని గుర్తుంచుకోవాలన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లింపు సమాచారం మమ్మల్ని హతాసులను చేసింది..విద్యుత్ శాఖ నుండి ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా …తనిఖీ చెసి సరిదిద్ది, తక్షణమే బిల్లులు రద్దు చేయాలని మంత్రిని మనవి చేస్తున్నామని వివరించారు.

ఆ భూముల పై విచారణ జరిపించాలి
విశాఖ జిల్లా భీమిలిలో శారదా పీఠానికి గతప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములనుస్వాధీనం చేసుకోవాలని కోరుతూవిధసం ఐక్యవేదిక కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టాయి.శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలు,ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని విదసం ఐక్య వేదిక కన్వీనర్ బూస వెంకట రావు డిమాండ్ చేశారు.దళిత సమస్యలపైనే కాదు దోచుకున్న భూములపై కూడా విదసం ఐక్య వేదిక పోరాటం చేస్తుందని అన్నారు.కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి సరదా పీఠం భూములపై సమగ్రత జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు కలిసి వినతి పత్రం సమర్పించారు