హ్మంచిర్యాలజిల్లా ములకలపేట వాసి కామెర పురుషోత్తంకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.మంచిర్యాల జిల్లా ములకల పేట గ్రామానికి చెందిన కామెర లక్ష్మి, నారాయణ గార్ల కుమారుడు కామెర పురుషోత్తం.తెలంగాణలో భావ కవిత్వం వస్తువు శిల్పం అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకుగాను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. కామెర పురుషోత్తం విద్యాభ్యాసం అంతా ఇంటిగ్రేటెడ్ స్థాయి నుంచి పీహెచ్డీ స్థాయి వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగింది. యుజిసి నిర్వహించిన నెట్,జె.ఆర్.ఎ ఫ్. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడుఅయ్యాడు.అలాగే ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన పోటీ పరీక్షలలో డిగ్రీ లెక్చరర్ గా పదోన్నతి పొందారు. ఈయన డాక్టర్ భూక్య తిరుపతి పర్యవేక్షణలో తన పరిశోధన కొనసాగించారు.కామెర పురుషోత్తం ‘డాక్టరేట్’ పొందిన సందర్భంగా తల్లిదండ్రులు, గురువులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పిల్లలు మర్రి రాములు, ఆచార్య గోనా నాయక్ ,పమ్మి పవన్ కుమార్ అధ్యాపకులు, బంధుమిత్రులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.