
ఇండియన్ బ్యాంక్ రిటైల్ అసెట్స్ ప్రాసెస్ సెంటర్ గచ్చిబౌలి ఐటీ కారిడార్ కు అందుబాటులోకి వచ్చింది.ఐటీ ఉద్యోగులు ఎక్కువగా హోమ్ లోన్ తీసుకుంటున్నందున సేవల్లో జాప్యం ఏర్పడకుండా ఉండేందుకే ఈ కేంద్రం ఉపయోగపడుతుందని బాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్ లో ఇప్పటివరకు నారాయణగుడాలో ఉన్నరిటైలింగ్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ ని ఐటీ కారిడార్ కు రావడం సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.హౌసింగ్,మార్టిగేజ్, విద్యా లోన్లు వేగవంతంగా మంజూరు చేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. హోమ్ లోన్ తీసుకోనే ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందించడమే లక్ష్యం గచ్చిబౌలి అంజయ్య నగర్ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్లలో 40 కోట్ల రూపాయల లోన్లు మంజూరు అనుమతి జారీ చేశాము. లోన్లకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదు. 30 సంవత్సరాల వరకు రుణాలు రీపేమెంట్ చెల్లించుకుని సదుపాయం ఉంటుంది. ఖాతాదారుడు 75 సంవత్సరాలు వచ్చేవరకు లోన్ చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాం.ఇండియన్ బ్యాంక్ హోమ్ లోన్ లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ప్రాసెసింగ్ ఫీజు,హిడెను చార్జీలు వసూలు చేయకపోవడంతో ఖాతాదారులకు మేలు జరుగుతుంది.