టెక్నాలజీ రంగంలో జెనెసిస్ ఇన్ఫో కు ప్రత్యేక గుర్తింపు

దేశ అభివృద్ధికి టెక్నాలజీ రంగం ఎంతో ముఖ్యమని ఈ రంగంలో జెనెసిస్ ఇన్ఫో (జెనెసిస్ ఇన్ఫర్మేటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ) కు ప్రత్యేక గుర్తింపు ఉందనిజాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్ డిజైన్స్, క్వాంటమ్ ఐ ​​మెషిన్ సొల్యూషన్స్, సైబర్‌ సెక్యూరిటీ,ఆటోమేషన్ & రోబోటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్, ఐఓటీ, స్మార్ట్ సిటీ ట్రాఫిక్ సొల్యూషన్స్, కార్పొరేట్ ట్రైనింగ్ వంటి సరికొత్త టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తోంది జెనెసిస్ ఇన్ఫో. టెక్నాలజీ పరంగా ఈ సంస్థ గత 18 సంవత్సరాలుగా విశేషమైన సేవలను అందించింది.50కి పైగా ఐటీ ప్రొడక్స్ట్స్ ను సృష్టించింది. రాబోయే రోజుల్లో ఎన్నో వండర్స్ ను చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.ముఖ్యంగా దేశ భవిష్యత్తు ఏఐ టెక్నాలజీపై ఆధారపడబోతోంది.. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని జెనెసిస్ ఇన్ఫో ప్రతినిధులు చెప్పారు.ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ధి చేయడంలో జెనెసిస్ ఇన్ఫో ముందు వరుసలో ఉంది. భారత్ టెక్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏఐతో ముడిపడి ఉందని, దేశంలోని వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, గణనీయమైన ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా జెనెసిస్ ఇన్ఫో ముఖ్య ఉద్దేశం అన్నారు.దక్షిణ అమెరికా,ఆఫ్రికా,జిసిసి దేశాలు, యూరప్‌లో కూడా కంపెనీ తన ప్రాజెక్టులను విస్తరిస్తుందని వివరించారు.శేరిలింగంపల్లి మండలంలోని,హైటెక్ సిటీ సైబర్ గేట్ వే లో 18వ వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంస్థ 18వ వార్షికోత్సవానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జెనెసిస్ ఇన్ఫర్మేటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.వినయ్ సరికొండ,చైర్మన్ నాగరాజు, వైస్ ఛైర్మన్ రమేష్ సంతానం తదితరులు దుండ్ర కుమారస్వామిని సత్కరించారు. D ఇన్ఫో టెక్నాలజీ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూన్నానని దుండ్ర కుమారస్వామి తెలిపారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *