ప్రతిభ గల విద్యార్థులకు పేదరికం అడ్డుగోడలా మారకూడదు. వారిని ప్రోత్సహిస్తే మరింత ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకు అందించే ఆర్థిక చేయూత, ప్రోత్సాహం వారిని మరింత చైతన్యవంతం చేస్తుంది. ఈ విషయం గ్రహించిన అల్లిమెరక గ్రామానికి చెందిన కొత్తపల్లి కామేశ్వరరావు, నగిరి ఉపేంద్ర పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉన్నత శ్రేణీలో పాసైన విద్యార్థులకు నగదు బహుమతి ప్రకటించారు. అనుకున్నట్లుగానే మందస మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2023-2024 సంవత్సరానికి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మందస అంబేద్కర్ విజ్ఞాన భవన్ లో నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు సమక్షంలో నగదు పురస్కారాన్ని పంపిణీ చేశారు. నగదు పురస్కారనందించిన కొత్తపల్లి కామేశ్వరరావు నగిరి ఉపేంద్ర లకు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు పే బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ ఇచ్చిన నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులు మిగతా వారికి చేయూతను అందించాలని సంఘమ నాయకులు కోరారు, ఈ కార్యక్రమంలో మందసా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నాయకులుకొత్తపల్లి మోహన్ రావు, ఎరిమాకు తులసీదాసు, సంక కాళిదాసు, జడ్డాడ శాంతారావు, పిలక శ్రీనివాసరావు, మట్ట జయరామ్, పొన్నంగి వసంతరావు,మట్ట ధనరాజ్, పిలక శ్రీనివాసరావు,యనాది వాసు,నగరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.పదో తరగతిలో 6 మంది ఇంటర్ లో ఆరుగురు విద్యార్థులకు నగదు పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారు

.