శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ పైగా లో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది.సర్వేనెంబర్ ఒకటి నుంచి 36 వరకు ఉన్న 37.8 ఎకరాలు తెలంగాణ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదీనంలో ఉంది. ఇందులో 5.16 ఎకరాలకు ప్రైవేట్ వ్యక్తుల మధ్య చాలా ఏళ్లుగా వివాదం నడుస్తుంది. సోమవారం రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, లీడ్ క్యాప్ అధికారులు సంయుక్తంగా భారీ పోలీసు బందోబస్తు నడమ కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే అక్కడ చేరుకున్న అధికారులు ఇంట్లో నివాసం ఉంటున్న వారిని బయటకు పంపించి సామాన్లు తొలగించి కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల అడ్డుకునేందుకు బాధితులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్న అధికారులు అన్యాయంగా కూల్చివేసారని బాధితులు ఆవేద వ్యక్తం చేశారు.ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలంలో ఉన్న నిర్మాణాలను అధికారులు కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా తమ ఇళ్ళను కూల్చివేసిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టపరమైన చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూములు వేలకోట్ల విలువ చేస్తాయి. ఇందులో ఎకరా పైబడి స్థలం ప్రైవేట్ వ్యక్తుల అధీనం లో ఉంది.ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి కావడంతో స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
యూనిటీ మాల్ వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటన
రాయదుర్గం ప్రధానరహదారికి ఆనుకుని కోట్లు విలువ చేసి 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటించారు. ఈ స్థలములో యూనిటీ మాల్ వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రాష్ట్రంలో మాల్స్ నిర్మించి ఆయా రాష్ట్రాలలో తయారయ్యే అన్ని రకాల తోళ్ళ ఉత్పత్తులు ఒకే చోట లభ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.ఉత్పత్తులు తయారు చేసి విక్రయించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తయారుచేసే ఉత్పత్తులు ఒకే చోట ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలో ఉన్న సర్వే నెంబర్ 1నుంచి 36 లలో 5.16 భూమిని స్వాధీనం చేసుకుని అందులో ఉద్యోగుల కోసం నిర్మించిన కబ్జాకు గురైన భవనాలను కూల్చివేశారు.భూమిచుట్టూ కంచె నిర్మిస్తున్నట్లు తెలిపారు.