బీసీలలో ధైర్యాన్ని నింపిన నాయకుడు రాహుల్ గాంధీ: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశానికి ఆదర్శం.తెలంగాణ రాష్ట్రంలో కులగణన మొదలవ్వడానికి కారకులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల కారణంగా నేడు కులగణన రాష్ట్రంలో మొదలైంది. పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శేర్లింగంపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి సామాజిక,ఆర్థిక,ఉపాధి,రాజకీయ కులసర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూబీసీలు బాగుపడాలంటే కులగణనతోనే సాధ్యమంటూ బలంగా నమ్మిన వ్యక్తి, శక్తి రాహుల్ గాంధీనే అంటూ ప్రశంసించారు. రాహుల్ గాంధీ చొరవతోనే కులగనన ప్రారంభమైందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి బడుగుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉండడం వలన కుల గణన ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు.. ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా తన నిర్ణయం మారదంటూ తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విషయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిర్ణయాలు అభినందనీయం. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ సర్వేలో సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించారని వివరించారు.తెలంగాణ వ్యాప్తంగా 1,17,44,000 ఇళ్లకు సర్వే చేయనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్ళు కేటాయించారు. కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం తీసుకుంటారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వం ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారంతో భవిష్యత్‌లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుంది. బీసీల అభివృద్ధికి ఈ సర్వే ఖచ్చితంగా ఓ కీలక మలుపుగా మారుతుందని జాతీయ బీసీ దళ్ ఆశిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, వి వెంకటరమణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
కులగణన అనంతరం బీసీ రిజర్వేషన్లలో మార్పులు వస్తాయా?
అసలు బీసీ జాబితాలో ఉన్న కులాలు ఏవి?బీసీ కులాల్లో ఉన్న కేటగిరీలు తెలుస్తాయని చెప్పారు.భారత్‌లో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది.ప్రస్తుత బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రాంతాలను కలిపి ఆ లెక్కలుంటాయి. ఆ తరువాత ఏ ప్రభుత్వమూ కులాల వారీగా జనాభాను లెక్కించలేదు. 1941 జనాభా లెక్కల నుంచే కులాలవారీ వివరాల సేకరణ ఆపేశారు.
విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక తదితర అంశాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలంటే ఏ కులం వారు ఎందరు ఉన్నారన్న లెక్క కచ్చితంగా తెలియాలన్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ కులానిది కీలక పాత్ర.గతంలో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీ కులాలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52 శాతం బీసీలు ఉన్నట్లు తేటతెల్లమైంది.కానీ అందులో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు.ఆ రిజర్వేషన్ల ఖరారు విషయంలోనూ తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి.ఈ క్రమంలో కులాల వారీగా లెక్క తేల్చేందుకే తెలంగాణ ప్రభుత్వం కులగణనను చేపట్టిందని వివరించారు. గ్రూప్-ఏ 7 శాతం, గ్రూప్-బీ 10శాతం, గ్రూప్-సీ 1 శాతం, గ్రూప్-డీ 7 శాతం, గ్రూప్-ఈ 4శాతంగా కేటాయించారు.ప్రస్తుత కులగణన తరువాత సామాజిక, ఆర్థిక, జనాభా, విద్య, ఉపాధి తదితర అంశాలను బేరీజు వేసి రిజర్వేషన్లలో రాష్ట్ర సర్కార్ మార్పులు తీసుకువస్తారని చెప్పారు.స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది.స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చింది.
read this
ఐదు రోజులపాటు బాధితురాలిని తన ఇంటిలోనే డిజిటల్ అరెస్ట్
సెల్ ఫోన్ చోరికి గురైతే పట్టేయొచ్చు…. ఫోన్ దొంగలకు ఇక బేడీలే
.