ఐటీ కారిడార్ లో సరోగసి మదర్ అశ్విత సింగ్ మృతి

ఆశ్రిత( FILE PHOTO)

సరోగసి పద్దతి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం వచ్చిన అశ్విత సింగ్ ఐటీ కారిడార్ లో ఉన్న హోమ్ భుజ అపార్ట్మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి పడి మృతి చెందడం కలకలం రేపుతుంది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే వివాహిత సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. భర్త అందుకు సానుకూలంగా స్పందించడంతోవివాహిత అశ్విత సింగను హైదరాబాద్ కు తెచ్చుకున్నరు. హైదరాబాద్ కు చెందిన మై హోమ్ భుజలో నివాసం ఉంటున్న రాజేష్ బాబు ఒప్పందం చేసుకున్నారు.ఇందు కోసం లక్షలు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సరోగసి పద్ధతిని వ్యతిరేకించడం తో పాటు వారి ప్రవర్తన నచ్చకపోవడంతో పారిపోవడానికి అశ్విత సింగ్..ప్రయత్నించినట్లు తెలుస్తోంది. చీర సహాయంతో కిందికి దగి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు తొమ్మిదవ అంతస్తు పై నుండి కిందపడి అశ్విత సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు.అశ్విత సింగ్ కు భర్త నాలుగు సంవత్సరాలలో బాబు ఉన్నాడు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి రాజేష్ బాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు.

పారిపోయేందుకు ప్రయత్నించారా… కారణమేమిటి?

పిల్లలు కావలనుకొని కనాలనుకునే దంపతులుమరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరగోసిగా పిలుస్తారు. పిల్లలు కావాలనుకునే పురుషుడి వీర్యాన్ని స్వీకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. పిల్లలను తన కడుపులో పెంచి, ప్రసవించే మహిళ బయట ప్రపంచానికి తెలియనివ్వరు. కేవలం పురుషుడి వీర్యంతో బిడ్డను కనిపెంచిన ఆ మహిళ, బిడ్డకు బయోలాజికల్ మదర్ అయినప్పటికీ.. ప్రసవం అనంతరం ఆ స్త్రీకీ, బిడ్డకూ ఎటువంటి సంబంధం లేకుండా ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ పద్ధతిని వ్యతిరేకించిన అశ్విత అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించారా ఇంకా మరేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. నిర్బంధం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారా? మరి ఏదైనా కారణం ఉందా పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

సరొగసీలో ఇంకో పద్ధతి

జెస్టేషనల్ సరోగసీ గా పిలిచే ఈ విధానంలో పిల్లలు కావాలనుకునే దంపతులస్త్రీ అండాన్ని, పురుషుడి స్పెర్మ్‌తో ఫలదీకరణం చేస్తారు.అనంతరం ఆ పిండాన్ని అద్దె గర్భంలో ఉంచుతారు.ఈ వ్యవహారం వైద్యుల పర్యవేక్షణలో జరుగుతుంది.ఎక్కువమంది ఈ జెస్టేషనల్ సరోగసీ పద్దతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.పిల్లలు కావాలనుకునే దంపతులలో సంతానోత్పత్తికి,గర్భస్రావం సమస్యలు, గర్భం ప్రమాదకరంగ మారినసమయంలో ఈ సరోగసీ పద్దతిని ఎంచుకోగా ధనికులు ఎక్కువగా ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు.ఈమధ్య కాలంలో సరోగసీ పద్ధతి చాప కింద నీరులా విస్తరిస్తోంది మూడో కంటికి తెలియకుండా జరిగిపోతున్న ఈ వ్యవహారంలో తాజా ఘటన ఎన్నో అనుమానాలకు తీవ్ర చర్చలకు దారి తీసింది.సెలెబ్రిటీలు సరొగసీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.సినీ,ఫ్యాషన్ రంగాలకు చెందిన మహిళలు ఈ విధానం వైపు మొగ్గుచూపుతున్నారు.కాన్పు అనంతరం స్త్రీలో వచ్చే శారీరక మార్పులు తప్పించుకునేందుకు ఈ పద్ధతికి ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

బిజిెనెస్ గా సరోగసీ?

సంతానం కోసం కొంత మంది దంపతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని ఆసుపత్రులు,గుడి, గోపురాలు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో డబ్బులు ఎక్కువ ఖర్చైనా ఈ పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. వారి వ్యక్తిగత కారణాలు ఎలా ఉన్న ఐవీఎఫ్ సేవలు అందించే ఆసుపత్రులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారు.ఉపాధి కోల్పోయిన మహిళలు కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్ గా మారెందుకు సిద్ధపడుతున్నారు. అద్దెకు గర్భాన్ని ఇచ్చేందుకురూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు డబ్బు వసూలు చేస్తున్నారు.ఇందులో మధ్యవర్తిత్వం వహించినవారు 30% కమిషన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిసింది.కొన్ని సందర్భాలలో సరోగసీ దుర్వినియోగం అవుతుండడంతోకేంద్ర ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నిబంధనలను కఠినతరం చేసింది.

2020లో సరోగసీ నియంత్రణ బిల్లులోని సంస్కరణలు ఏం చెబుతున్నాయి

గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలకు కఠిన షరతులు విధించింది.వివాహితకు మాత్రమే సర్రోగేట్ గా మారే అవకాశం ఉంటుంది.విడాకులు పొందినా మహిళలకు మినహాయింపు ఉంటుంది. వివాహిత బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. సర్రోగేట్ మదర్ వయస్సు కనీసం 25 నుండి 35 ఏళ్ళ మధ్య ఉండి, సరోగసీని ఎంచుకున్న జంటకు సమీపబంధువు అయి ఉండాలి. మహిళ ఇష్టపూర్వకంగా ఇందుకోసం ఒప్పుకుంటునట్లు ఒప్పందం జరగాలి సరోగసీ నియంత్రణ బిల్లుకు సవరణలు చేసింది ప్రభుత్వం.2022జనవరి 25 నుండి అమలులోకి వచ్చింది. ఒక సర్రోగేట్ తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే సరోగసి మదర్ గా మారాలి. గతంలో ఈ విధానం మూడు సార్లుగా ఉండేది.కడుపులో ఉన్న బిడ్డకు సంబంధించిన ఖర్చులన్నీ సరోగసి పొందుతున్న  వారి చెల్లించాలి.వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో కొందరు మహిళలు సంతానాన్ని పొందలేక వేదనకు గురవుతుంటే డబ్బున్న కొందరు ఇలా అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుయి.ప్రతి మహిళా అమ్మతనాన్ని ఆస్వాదించాలి.ఇలా డబ్బుతో ఆ (క)మ్మదనానికి దూరం కావొద్దనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తం అవుతుంది.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *