
సాంస్కృతిక ,విజ్ఞాన బాలల దినోత్సవం సందర్భంగా టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి పెగా సిస్టం సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. లిటరసీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గుణాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ మేనేజింగ్ ట్రస్ట్ కి వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి లిటరసీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాదాపూర్ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారు. విద్యార్థుల్లో ఆంగ్లంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ఆటలు, పాటలు విద్య సంబంధిత అంశాలపై నిర్వహించిన పోటీలలో మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు,అధ్యాపకులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విద్య సంబంధిత పోటీలలో గీతం కృష్ణ అనే విద్యార్థి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆటల విభాగంలో కావ్య ,హారిక పాటలు పోటీలలో అలేఖ్య, అమృత టీచ్ ఫర్ చేంజ్ విభాగంలో గౌతం కృష్ణ, పవిత్ర, ఫైజల్ బహుమతులు గెలుచుకున్నారు. మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల కు చెందిన ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, కావ్య ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి అవార్డులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేలాపు మోహన్ రావు మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో బహుమతులు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు పిల్లల్లో ఆంగ్లం నైపుణ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న టీచ్ పర్ చేంజ్ మేనేజింగ్ ట్రష్టి మంచు లక్ష్మికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓవెంకటయ్య ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
also read this
.ఐదు రోజులపాటు బాధితురాలిని తన ఇంటిలోనే డిజిటల్ అరెస్ట్
ఐటీ కారిడార్ లో సరోగసి మదర్ అశ్విత సింగ్ మృతి
.