డి ప్రోగ్రాం ఫేమ్ కన్హ మహంతి డ్రగ్స్ కేసులు పట్టుబడ్డాడు. స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవిస్తుండగా మాదాపూర్ ఎస్ ఓటి పోలీసులు రైడ్ పట్టుకున్నట్లు మాదాపూర్ డిసిపి వినిత్ కుమార్ తెలిపారు.గత శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొండాపూర్ లోని ఓయో బోటిక్ హోటల్ గది 303లో అద్దెకు దిగారు. మత్తు పదార్థాలు సేవించేందుకు ఏర్పాటు చేసుకుంటుండగామాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. వైజాగ్ మద్దిలపాలెం కు చెందిన బుల్లి పల్లి గంగాధర్,మాదాపూర్ లో హాస్టల్ లో నివాసం ఉంటున్న ప్రియాంక రెడ్డి ,గుడివాడ లీలామహల్ చెందిన ఓగిరాల సకిల్,డాన్సర్, కొరియోగ్రాఫర్ కన్హమహంతి, కొండం దివాకర్ రెడ్డి, మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు విశ్వసినీ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. ఈ తనిఖీలలో మత్తు పదాలు సేవిస్తున్న కన్హాతో పాటు మరో ముగ్గురు డ్రగ్ ఫెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారు వద్ద నుంచి 3.5 లక్షల విలువ చేసే 18 గ్రాముల ఎండిఎంఏ,ఒక గ్రాముఒజికుస్, వన్ గ్రామ్ ఎల్ ఎస్ డి పేపర్,ఏడు గ్రాముల ఇండియన్ చెరస్ 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నేహితులతో పార్టీ ఏర్పాటు కోసం బుల్లి పల్లి గంగాధర్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించాడు. గంగాధర్ డ్రగ్స్ అవసరమైన వారికి విక్రయిస్తూ సరఫరాదారుగా మారాడు .ప్రధాన సప్లయర్ పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకుంటే డ్రగ్స్ తో సంబంధమైన అనేక లింకులు బయటపడే అవకాశం ఉంది. గత కొన్ని ఏళ్లు గా గంగాధర్ డ్రగ్ పెడ్లర్ గా పబ్బుల్లో పరిచయమైన వారికి సరఫరా చేస్తుంటాడు.ఆ పతిచయం తోనే కన్హ మహంతి కి డ్రగ్సర్పర చేసినట్లు తెలుస్తోంది. కన్హ మహాంతితో పాటు మరో యువతకి డ్రగ్ పాజిటివ్గా వచ్చినట్లు డిసిపి వినీత్ కుమార్ తెలిపారు.
also read this
సెల్ ఫోన్ చోరికి గురైతే పట్టేయొచ్చు…. ఫోన్ దొంగలకు ఇక బేడీలే