మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా డి సురేష్ నాయక్

డి.నగేష్ నాయక్

మాదాపూర్ (107) డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డి.నగేష్ నాయక్ ను నియమిస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు.ఎంటెక్, ఎల్ఎల్ బి చేసిన నగేష్ పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. పలు పరిశ్రమల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నారు. నగేష్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది గత దశాబ్ద కాలం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ పార్టీ ఆదేశించిన పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీమీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి తనకున్న ప్రజాబలాన్ని చాటుకున్నారు. సోదరుడు సురేష్ నాయకతో కలిసి మాదాపూర్ డివిజన్లో అనేక సమస్యలపై పోరాటం చేశారు. నగేష్ నాయక్ కు మంచి వక్తగా పేరు ఉంది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు సాధించడంలో నగేష్ నాయక్ పాత్ర చాలా కీలకం.ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కీలకమైన మాదాపూర్ డివిజన్ బాధ్యతలు అప్పగిస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామకు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా మాదాపూర్ లోని కమ్యూనిటీ హాలలో నగేష్ నాయక్ ను ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎంబిసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేసి మృతి చెందిన సురేష్ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా ఎంపికకు సహకరించిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాదాపూర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశామని అందుకు తగిన గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలోఅనేక అవమానాలకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం లేనప్పుడు సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీ పటిష్ఠత కోసం కృషి చేశామని వివరించారు. ఈ నేపథ్యంలోనే సోదరుడు సురేష్ నాయక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మృత్యువాత పట్టడం తమ కుటుంబానికి తీవ్ర విషాదంలోకి నెట్టింది అన్నారు. సురేష్ మృతి తమ కుటుంబానికి, పార్టీకి తీరనిలోటని చెప్పారు. పార్టీ నమ్ముకుని పనిచేసే వారికి తగిని గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి తన నియమకమే నిదర్శనమని అన్నారు. ఇందుకోసం కృషి చేసిన ఎంబీసీ చైర్మన్ జైపాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఇతర ముఖ్య నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాదాపూర్ డివిజన్లో ఒకవైపు హైటెక్ హంగులతో అద్దాల మేడలతో దర్శనమిస్తుంటే మరోవైపు బస్తీలు, కాలనీలలో సమస్యలు ఉన్నాయని వాటన్నింటి పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి జరుగుతుందన్నారు. మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తానన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *