వ్యాధుల పట్ల సరైన అవగాహన ఉండాలి: డాక్టర్ నాగమణి

 

వైద్యరంగంలో వస్తున్న సరికొత్త టెక్నాలజీ రోగులకు వరంగా మారింది. దీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలు, నడుము, వెన్న నొప్పులకు సర్జరీ లేకుండా నొప్పులు తగ్గించేందుకు ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఆసుపత్రి వైద్యులు శ్రీకారం చుట్టారు. లింగంపల్లిలో ఉన్న నంది ఆసుపత్రి, ఇండో బ్రిటిష్ పెయిన్ క్లినిక్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నంది ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగమణి సి గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు ఇలాంటి వైద్య సహాయం అందించాలో వృద్ధులకు వివరించారు.ఈ ఉచితశిబిరంలో తీవ్రంగా వేధించే వివిధ రకాల జాయింట్ నొప్పులకు నాన్ సర్జికల్ అడ్వాన్స్డ్ వైద్య చికిత్సపై అవగాహన కలిగించారు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని డాక్టర్ నికిత,డాక్టర్ ఉదయ్ చెప్పారు. ఈ తరహా నొప్పులకు మందులు వాడడం ద్వారా నయం కాకపోతే సర్జరీ చేయడమే సరైన మార్గమని భావిస్తున్న తరుణంలో మదినగూడ లో ఏర్పాటుచేసిన పెయిన్ క్లినిక్ లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. దీర్ఘకాలికంగా వేధిస్తు ఫోర్త్ స్టేజి లో ఉన్నప్పుడు కచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు చెప్పారు.జాయింట్ నొప్పులు ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం చేయించుకుంటే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సూచించారు. రీజనరేటివ్ థెరపీ,స్టెమ్ సెల్స్, కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, జాయింట్ ఇంజక్షన్, ఓజోన్ తెరఫీ ఎపిడ్యూరల్ ఇంజక్షన్, స్పైనల్ కార్డ్ స్టిములేషన్, న్యూరోలైటిక్ బ్లాక్ తదితర అధునాతన నాన్ సర్జికల్ చికిత్స అందించడం ద్వారా నొప్పులు తగ్గిస్తామని వైద్యులు తెలిపారు. మైగ్రేన్, భుజం నొప్పి, మెడ యాంకిల్ నొప్పులకు ఈ విధానం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.నంది ఆసుపత్రి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నాగమణి మాట్లాడుతూ ప్రారంభ దశలోనే శారీరక ఇబ్బందులు గుర్తించి వైద్యం చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు, ఆరోగ్యం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పౌష్టికాహారం శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ భాస్కర్, సి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *