
మాదాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గూడూరి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 320 బి డిస్టిక్ గవర్నర్ లైన్ రాజేంద్రప్రసాద్, సహారా ప్రెసిడెంట్ వి హేమమాలిని, వినోద్ కుమార్, బల్జిత్, వినీత్ గోయల్, విజయలక్ష్మి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామాగ్రి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తమ పాఠశాలలో అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు అధికంగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేందుకు వస్తుండడంతో వారికి అవసరమైన వసతుల కల్పనకు దాతలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీదేవి, రాజగోపాల్ రెడ్డి ,బాలమణి, ప్రసాద్, ప్రేమ్ కుమార్, సారిక, నవ్య, ఏ ఏ పీ సి చైర్మన్ శాంతి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.also read this
పెళ్ళైన నాలుగునెలలకే ఆత్మహత్య చేసుకున్న మహిళ టెకీ