
ఆవాసా హోటల్లో క్రిస్మస్ వేడుకలు ప్రత్యేకంగా జరుపుకున్నారు.అనాధ పిల్లలతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చిన్నారులతో కలసి ఆట పాటలలో పాలుపంచుకున్నారు.కరుణ ప్రేమ క్షమా సహనం ధాతృత్వం త్యాగం ఇవన్నీ ఏసుప్రభు జీవితం ద్వారా మనుషులందరికీ అందించిన మహోన్నత సందేశాలు అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ప్రముఖ ఎన్జీవో డాక్టర్ నిర్మల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవోదయ హోమ్ కు చెందిన 50 మంది అనాధ పిల్లలను అవసా హోటల్ లో విందు ఏర్పాటు చేశారు .ఇందుకు సహకరించిన ఆవాస్ హోటల్ యజమాన్యానికి జిఎం గురు, నలినికి ధన్యవాదాలు తెలిపారు.పేరు,ప్రతిష్ఠ,గౌరవాభిమానాలు, జేబుల నిండా డబ్బులు వంటివి సంతోషాన్ని ఇవ్వవని గుర్తు పెట్టుకోవాలనీ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు అన్నారు. మనం చేసే మంచే, శాంతి, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని యేసు జీవితాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. ప్రపంచానికి శాంతిని, ప్రేమను అందించిన మహనీయుడు యేసు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీ ఎదుగుదలలో ఆయన ఇచ్చిన బోధనలు కూడా తోడ్పాటును అందిస్తాయని చెప్పారు.స్టార్ హోటల్ విందు భోజనం చేసిన చిన్నారులు సంతోషం వ్యక్తంచేశారు.చిన్నారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కుమార స్వామి తెలిపారు