
విదేశీ యువతలతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్ చేసిన మాదాపూర్ ఎస్ ఓ టి పోలీసులు. వారి వద్ద నుండి సెల్ ఫోన్లు,భారీగా నగదు,కండోమ్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు గచ్చిబౌలి పోలీసులు చెప్పారు.కెన్యా దేశానికి చెందిన ఐదు మందిటాంజానియాఉగాండా దేశానికి మొత్తం తొమ్మిది మంది విదేశీ మహిళలతో గౌలిదొడ్డిటీఎన్జీఓ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో రెండు పోర్షన్ లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు విటులతోపాటు తొమ్మిది మంది మహిళలను అరెస్ట్ చేసి సంరక్షణ కేంద్రానికి తరలించారు.గత కొన్ని నెలలుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు.విటులు అపార్ట్మెంట్ కు చేరుకోగానే అతని ఫోన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూపు అందులో వచ్చిన లింక్ మాయం చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత పడుతున్నారు.ఇప్పటివరకు విదేశాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించలేదని తెలుస్తోంది.గత కొన్ని నెలలుగా గలిజ్ దందాకు తెరలేపిన ముఠా వివిధ దేశాలతో సెక్స్ రాకెట్ నెట్ వర్క్ కలిగివున్నట్లు గుర్తించారు.పోలీసులకు పట్టుబడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్న ముఠా పోలీసులు దాడుల్లో మహిళలే పట్టుబడడం నిర్వాహకులు ఆచూకీ లభ్యం కాకుండా జాగ్రత్త పడ్డారు.ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు చెందిన మహిళలు జుట్టు ,విగ్గుల వ్యాపారం పేరుతో హైదరాబాద్ కు రప్పిస్తున్న ముఠా వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో వల… గచ్చిబౌలిలో వ్యభిచారం
ఎంపిర్ ఎస్కార్ట్ పేరుతో సోషల్ మీడియాలో విదేశీ యువతులతో గాలం వేస్తున్నారు.ఎవరైనా ఆకర్షితులైతే యాప్ లింకును పంపిస్తారు. ఆ లింకు ఓపెన్ చేసి యాక్సెస్ రిక్వెస్ట్ నొక్కిన వెంటనే ఫోన్ నెంబర్ ,వాట్సాప్ యాక్సెస్ చూపిస్తుంది. వాట్సాప్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫోన్లో గ్రూప్ క్రియేట్ అయి అందులో యువతులు సంబంధించిన ఫోటోలు అశ్లీల వివరాలుపంపిస్తారు. వారు చెప్పే చిరునామాకు చేరుకోగానే అప్పటివరకు చాట్ చేసిన వివరాలు యాప్ లు ఫోన్ నుంచి మాయమవుతాయి.ఏ ఐ ఆధారిత టెక్నాలజీ ద్వారా పకడ్బందీగా సెక్స్ రాకెట్ ను నడుపుతున్నట్లు గుర్తించారు.