
చిన్నతనంలోనే చోరీలబాట పట్టాడు.27 ఏళ్లకే గజ దొంగగా మారి 53 దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పక్కా స్కెచ్ తో దొంగతనం చేసి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తప్పించుకోవడంలో దిట్ట. మూడు రాష్ట్రాల పోలీసులకు తప్పించుకొని తిరుగుతున్న నెహామియా అలియాస్ బ్రూస్ లీని ఎట్టకేలకు చందనగర్ పోలీస్ లు అరెస్ట్ చేశారు.మాదాపూర్ డిసిపి వినీత్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10వ తేదీన చోరీ జరిగినట్టు పిర్యాదు అందడంతో పోలిసులు అప్రమత్తం అయ్యారు.నెహమియా అలియాస్ బ్రూస్లీ అనే నిందితుడిని అరెస్ట్ చేసారు.ఆతనిపై 53 కేసులు ఉన్నాయి. పది సార్లు జైలుకు వెళ్లాడు.అయినా తీరు మార్చుకోకుండా దొంగతనాలు చేస్తున్నాడు.ఒకేసారి రెండు మూడు ఇళ్లలో చోరీ చూసి వెళ్ళిపోతాడు.రాడ్లను ఉపయోగించి ఇంటి తాళం తీయడంలో నిందితుడు దిట్ట.సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.ఇతను సైబరాబాద్,హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల,కర్ణాటక పరిధిలో కేసులు నమోదయ్యాయి.13 కేసుల్లో నిందితుడికి శిక్ష పడ్డా పరివర్తన రాకపోవడంతో ఫీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు.నిందితుడి వద్ద నుండి 25 లక్షల విలువచేసి25 తులాల బంగారం, 300 గ్రాములు సిల్వర్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.చోరీ చేసిన సొత్తు ఎవరికి విక్రయించాడనే విషయాలపై దర్యాప్తు చేసి కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.నిందితుడిపై కర్ణాటకలో ఏడు, ఏపీలో 9 కేసులతోపాటు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్రెండు కేసులు ఉన్నాయి.మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నెహామియా తో పాటుకురువ నాగేష్ అరెస్ట్ చేయగా మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.నేహామియా పై సైబరాబాద్ లో 17 కేసులు హైదరాబాదులో 12, రాచకొండలో 6కర్ణాటకలో ఏడు ఆంధ్రప్రదేశ్లో 9 సికింద్రాబాద్ జిఆర్పి లో రెండు కేసులు ఉన్నాయన్నారు.
read this links
ఎమ్మెల్యే గాంధీ తన పధవికి రాజీనామా చేయాలి
దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజ్ఞశ్రీ