హైటెక్ సిటీ వాసులను భయపెడుతున్న భారీ గుంత

హైటెక్ సిటీ రోడ్డు పక్కన ప్రమాదకరమైన గుంత

వర్షాకాలంలో సెల్లార్లు,భారీ గుంతలు తవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేసే జిహెచ్ఎంసి అధికారులే తప్పు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భారీ వర్షాలు పడితే ప్రమాదం పొంచి ఉంది.గుంతలో నీరు చేరి గుర్తించలేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. చందానగర్ సర్కిల్ ఇంజనీరింగ్ అధికారుల తప్పిదం హైటెక్ సిటీ వాసులకు ప్రాణ ప్రాణసంకటంగా మారింది.
మాదాపూర్ హైటెక్ సిటీ ప్రధాన రహదారి పై నీరు నిలవకుండా ఉండేందుకు కాలువ నిర్మిస్తున్నారు. నెలరోజుల్లో పూర్తి చేయాల్సిన కాలువ నిర్మాణం పనులు వర్షాకాలం ముంచుకొచ్చిన పూర్తికాలేదు.కాలువ బాక్స్ర రోడ్డు వరకు నిర్మించి వదిలిపెట్టారు. దీనితో రహదారి పక్కన ఏర్పడ్డ భారీ గుంత భయబ్రాంతులకు గురిచేస్తోంది.సిటీ వైన్స్, విక్రమ్ హాస్పిటల్ వద్ద వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు కాలువ నిర్మిస్తున్నారు.ఈ కాలువ నిర్మాణం అంజనినగర్ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ప్రధాన రహదారి గుండా వెళ్లే కాలువ నిర్మాణం అసంపూర్తిగా వదిలేశారు రహదారి పక్కన కల్వర్టు కోసం భారీ గుంత తవ్వి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు ఈ గుంత గుర్తుపట్టలేక అందులో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.
వర్షాకాలంలో సెల్లార్లు,ఎవరైనా రోడ్డు కటింగ్ చేసి పైపులు వేస్తే  చర్యలు చేపడతామని చెప్పే జిహెచ్ఎంసి జోనల్ అధికారులు ప్రమాదకరంగా ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంపై ఇంజనీరింగ్ అధికారులకు కాలనీవాసులు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. దీంతో ఈ రోడ్డుకు ఇరువైపులా నివాసం ఉండే కాలనీవాసులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు పొరపాటున వాహనాలు అదుపు తప్పితే అందులో పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.గత ఏడాది వర్షాకాలంలో ఇదే ప్రాంతంలో మ్యాన్ హోల్ గుర్తించలేక అందులో  పడి మృతి చెందాడు. అయినా జిహెచ్ఎంసి  సర్కిల్ ఇంజనీర్ అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.ఎంతో ఇబ్బందికరంగా మారినా కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన బారి గుంత పూడ్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా :దుండ్రా కుమారస్వామి

  1. బిసి దళ్ అధ్యక్షుడు దండ్రు కుమార్ స్వామి

హైటెక్ సిటీ కి కూత వేటు దూరంలో ఉన్న ప్రధాన రహదారి పక్కన భారీ గుంత తవ్వి ఆరు నెలలు గడుస్తున్నా నిర్మాణం పనులు పూర్తి చేయలేదు. వర్షం కురిసే సమయంలో భారీగా నీరు ప్రవహిస్తే వాహనదారులు గుర్తించలేక అందులో పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రమాదకరమని తెలిసిన జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పట్టించుకోవడం లేదు. చందానగర్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి నిర్మాణం పనులు పూర్తి చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుమతులు లేక ఆగింది.ఈఈ రాజు

రోడ్డుపై నిలిచే వర్షం నీరు పోయేందుకు వీలుగా కల్వర్టు నిర్మించామని చందానగర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు చెప్పారు. ప్రధాన రహదారిపై మ్యాన్ హోల్ నిర్మాణం గుంత తవ్వెందుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే కారణంతో పోలీసులు నిర్మాణం పనులకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రోడ్ మధ్యలో మ్యాన్ హోల్ గుంత తవ్వి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేస్తామన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *