జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకుతొలి విమాన సర్వీసును ప్రారంభమయ్యింది.స్పైస్ జెట్ తో హైదరాబాద్ నుంచి అయోధ్యకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ ఐఏఎల్ ) ప్రకటించింది.హైదరాబాద్ నుంచి అయోధ్యకు SG611 విమానం 10:45 గంటలకు బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SG616 విమానం అయోధ్య నుంచి 13:25 గంటలకు బయలుదేరి 15:25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ – స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ,అయోధ్య నగరం సమీపంలోని సాంస్కృతిక, పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ప్రయాణికలకు ఈ కొత్త సేవను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. విమానయాన సంస్థలతో కలిసి ప్రయాణికలకు మెరుగైన సేవలు అందిస్తూ హైదరాబాద్ విమానాశ్రయం తమ మార్గాలను విస్తరించేందుకు నిరంతరంగా కృషి చేస్తోందన్నారు.పవిత్ర నగరంగా గుర్తింపు పొంది, శ్రీరాముడి జన్మస్థలంగా పూజలందుకుంటున్న అయోధ్యకు మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత ఉంది… ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా పర్యాటకులకు మధురానుభూతిని కలిగించడమే ద్యేయమని వివరించారు