
మాదాపూర్ ఉద్యోగుల భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ గా బాబుల్ నాథ్ నాయక్ మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేసిన బబుల్ నాథ్ నాయక్ పదోన్నతిపై మాదాపూర్ కు బదిలీ అయ్యారు. న్యూఢిల్లీలోని పి ఎఫ్ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన ఉత్తర్వులలో ఐదు మందికి పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణ భారతదేశం పి ఎఫ్ కార్యాలయాల నుంచి బాబుల్ నాథ్ నాయక్ ఒక్కరికే ఈ పదోన్నతి లభించడం విశేషం.అసిస్టెంట్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న బబుల్ నాథ్ నాయక్ ను పలువురు ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించడం ద్వారా ఖాతాదారుల మన్ననలు పొందాలని తోటి ఉద్యోగులకు సూచించారు.
this is also read
ఐటీ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం ఉలిక్కిపడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు