
మందుబాబులకు పోలీసులు చేదువార్త చెప్పారు. రేపు (సోమవారం) వైన్ షాప్లు తెరుచుకోవు. హోలీ పండుగ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులను మూసి ఉంచాలని పోలీసులు సూచించారు.