భార్య నన్ను విపరీతంగా కొడుతుంది.నాకు విడాకులు ఇప్పించండి. లేకుంటే చనానిపోతాను అంటూ నగేష్ అనే వ్యక్తి చెరువులోకి దూకాడు. స్థానికులు గమనించి తాడు సహాయంతో గుట్టు పైకి తీసుకువచ్చి రక్షించారు.పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య ఉన్న నీటి గుంతలోకి ఓ వ్యక్తీ దిగడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.హైదరాబాద్ కొంపల్లి జైభేరి పార్కు చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తాను పడుకునే సమయంలో తన భార్య తనను విపరీతంగా కొడుతుందని తన శరీర భాగాలపై ఉన్నగాయాలు చూపించాడు.ముఖం,వీపు, ఇతర శరీర భాగాలు పై వాతలు పెట్టిందని సరిగా భోజనం పెట్టదని ఫ్యాన్ కూడా ఆపేస్తుందని వాపోయాడు. తనపై పిల్లలకు తప్పుడు ప్రచారం చేస్తుందని ఇలాంటి భార్య తనకు వద్దని విడాకులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు.