క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టించిన  సైబరాబాద్ ఎస్ ఓటి

 

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలోక్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను సైబరాబాద్ యస్.ఓ.టి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.రాజేంద్రనగర్,ఆర్.సి పురం.ఓ.టి పోలీసు జాయింట్ ఆపరేషన్ తో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయింది. ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం తో రైడ్ చేసిన పోలీసులు.రూ 37,84,918 నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఎస్ ఓటి డీసీపీ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం తో రైడ్ చేసిన పోలీసులు..18 లక్షల 50 వేల నగదుతో పాటు మరో 18 లక్షల 34 వేలు బ్యాంకు ఖాతాలోని నగదు ఫ్రీజ్ చేశారు.

అన్ని వ్యవహారాలు ఆన్లైన్ లొనే..

డిల్లీ కేంద్రంగా  ఆన్ లైన్ యాప్ తయారు చేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు  పోలీసులు గుర్తించారు. ఎవరికి  దొరక్కుండా ఉండేందుకు బూకీలు పక్క ప్లాన్ వేశారు. 7777 వెబ్ సైట్, యాప్ రూపొందించినవారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి ఈ యాప్ లో పేరు నమోదు చేసుకోవాలి.  సభ్యత్వం తీసుకున్నందుకు 5000 చెల్లించాలి. క్రికెట్ ఆడుతున్న జట్టు గెలుపు ఓటములపై పందెం కాస్తారు.  ఒక్కో క్రీడాకారుడువేసే  ఓవర్లు, చేసే పరుగులు, ఒక్కో ఓవర్ కి ఎన్ని పరుగులు వస్తాయి.ఇలా బెట్టింగ్ గ్యాంగ్ రెచ్చిపోతుంది.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో40 మంది పై బడి  ఐ.పి.యల్ మ్యాచ్ల బెట్టింగ్ కు పాల్పడ్డాట్లు గుర్తించారు.

పరారీలో  కింగ్ పిన్ సోనూ 

సైబరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ను నిర్వహిస్తున్న ముఠాపై నిఘా పెట్టిన పోలీస్ లు ముఠా  సభ్యులు..రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్ లను అరెస్ట్ చేశారు…డిల్లీ కేంద్రంగా  ఆన్లైన్ బెట్టింగ్ కింగ్ పిన్ గా ఉన్న  సోను ఈ మొత్తం వ్యవహారానికి  కీలక సూత్రదారిగా గుర్తించారు.చాకచక్యంగా వ్యవహరించి ఇద్దర్ని అరెస్ట్ చేయగా సోనూ  పరారీలో ఉన్నాడు 45 మంది పైబడి ఫంటర్ లు ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ కు అలవాటు పడ్డారు.  మాదాపూర్ డిసిపి వినీత్, ఎస్ ఓ టి డి సి పి డి శ్రీనివాస్, అడిషనల్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక  టీం తో కలిసి ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు అలవారు పడ్డ  చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు.  ఈ బెట్టింగ్లో బూకీలు  ఆర్థికంగా లాభపడుతున్నట్లు ఫాంటర్ లు  తెలుసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.  ఆన్లైన్ లో  వివిద పేర్లు తో బెట్టింగ్ యాప్ లు ఉన్నాయి. అందులో BET 365,MPL BET WAY, డీర్న్ గురు, మై 11 సర్కిల్, కోరల్, లోటస్ క్రికెట్ లైన్ బీన్, 777 బెట్, cricket betting 2020,just bet, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్లలో సభ్యులుగా చేరితే ఖాతాలో నగదు తస్కరించడంతోపాటు సైబర్ కేటుగాళ్లు బ్లాక్ మెయిలింగ్ పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు సైబరాబాద్ లో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ పాల్పడితే డయల్ 100 కాల్ చేయాలని లేదంటే 9490617444 ఫోన్ కు వాట్సాప్ సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *