
కొండాపూర్ ట్రాన్స్కో కార్యాలయంలో ప్రైవేట్ మీటర్ రీడర్ గా పనిచేస్తున్న ఆనంద్ మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యుత్ మీటర్ కు నమోదైన రీడింగ్ తీసి బిల్లులు వినియోగదారులకు ఇచ్చే బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికునికికి విద్యుత్ సప్లైలో ఏర్పడ్డ ఇబ్బందులు సరిచేసే పని అప్పగించి ఆనంద్ చావుకి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.మీటర్ రీడర్ గా పని చేసే కార్మికునికి ఇతర పనులకు వినియోగించకూడదు.వారికి విద్యుత్ సప్లై లో ఏర్పడ్డ అంతరాయాలు సరిచేసే నైపుణ్యం ఉండదు.ఇందుకోసం ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఫీజు పోతే ప్రమాదకరమైన ఏబి స్పీచ్ ఆప్ చేసి విద్యుత్ సప్లై పునరుద్ధరించాలి.ఈ విధులు లైన్ మ్యాన్ మాత్రమే నిర్వహించాలి. ఇందుకోసం ఏఈ నుంచి ఎస్ ఈ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి.కానీ మీటర్ రీడర్ ను వినియోగించి కార్మికులు చావుకి కారణమయ్యారని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏబి స్విచ్ లో ఉన్న మూడు బ్లేడ్లలో ఒకటి తెరుచుకోకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విద్యుత్ పునరుద్ధరించమని తాము చెప్పలేదని అధికారులు తప్పించుకుంటున్న వారి ఆదేశాలు లేనిదే విద్యుత్ స్తంభం ఎక్కే సాహసం ఎవరు చేయలేరు అన్నది నగ్నసత్యం.
ప్రతి నెల ఒకటి నుంచి 11వ తేదీ వరకు మీటర్ రీడింగ్ చేసి తాత్కాలిక కార్మికుడు. ఒక్కో మీటర్ కు రీడింగ్ తీసినందుకు రూ 2.51 పైసలు చెల్లించాల్సి ఉన్న అందులోనూ కోతలు.ప్రతి నెల సుమారు 4వేలు వేతనం పొందుతున్న కార్మికులు నైపుణ్యం లేని పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఐదు రోజులు వ్యవధిలో ఇద్దరు ట్రాన్స్కో ఒప్పంద కార్మికులు మృతి చెందడం చర్చనీయాంసమయింది. ఆనంద మృతదేహంతో కార్మికుల ధర్నా చేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు దిగివచ్చి 16 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని సిఐటియు కార్మిక నాయకుడు కొంగరి కృష్ణ చెప్పారు.కర్ణికులకు సరిపడా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మారుతోంది.ఇందుకోసం ప్రమాదకరమైన పనులు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం మరమ్మత్తులు చేస్త వినియోగదారులు ఇస్తున్న డబ్బులకు ఆశపడుతున్నరనే వాదన ఉంది.
కార్మికుల హక్కుల కోసం పోరాటం: సిఐటియు నాయకులు కొంగరి కృష్ణ
ట్రాన్స్కో లో వివిధ రకాల విధులు నిర్వహించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలు నియమించారు. వీటి ద్వారానే అధికారుల పర్యవేక్షణ లో బిచ్చరపురాలు ఏర్పడే అంతరాయాలు పరిష్కరించాలి. అనుభవం లేని మీటర్ రీడర్లకు ప్రమాదకరమైన పనులు అప్పగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకోవలసిన అధికారులు తమకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. ఆనందం మృతి సమాచారం తెలుసుకున్న తోటి కార్మికులు తొలుత కొండాపూర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించక పోవడంతో ఆనంద మృతదేహంతో కెపిహెచ్బి లో ఉన్న డివిజనల్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో అధికారులు చర్చలు జరిపారు.పరిహారం చెల్లించేందుకు అధికారులు అంగీకరించడంలో సిఐటియుకు అనుబంధంగా ఉన్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ క్రియాశీలకంగా వ్యవహరించింది.