
బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 69 వ జన్మదినం సందర్భంగా బీఎస్పీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.పటాన్ చెరు నియోజకవర్గం లోని ప్రభుత్వ ఏరియ ఆసుపత్రిలో పటాన్చెరు నియోజకవర్గం అధ్యక్షులు శ్రీశైలం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు.ఇందుకు సహకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వసుంధర, ఆర్ ఎమ్ ఓ డాక్టర్ ప్రవీణ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, తెల్లాపూర్ మునిసిపల్ అధ్యక్షులు దర్శన్, సీనియర్ నాయకులు జనార్దన్, కృష్ణ, రుద్రారం గ్రామం నాయకులు జనార్ధన్,శ్రీనివాస,ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీశైలం మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాలకవర్గాలు కృషి చేయాలన్నారు.70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వివక్ష కొనసాగుతున్నడం అత్యంత విషాదకరమన్నారు.బహుజన సమాజ్ పార్టీని బలపరచడం ద్వారా సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.