తొలితరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గుండె పోటుతో కన్నుమూశారు.దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యేరీతిలో వార్తలు చదవడంలో నిష్ణాతులు.తీవ్ర అస్వస్థత కు గురైన ఆయన హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూమృతి చెందారు.ఈ తరం వారికి అంతగా తెలియని న్యూస్ రీడర్.అచ్చమైన తెలుగులో స్పష్టమైన ఉచ్చారణ ఆయన సొంతం.తెలుగు దూరదర్శన్ అంటే మొదటిగా చెప్పే పేరు శాంతి స్వరూప్. రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమవుతారు.ఆ కంఠం గ్రామీణ పాఠకులకు దగ్గర చేసింది.1977 అక్టోబర్ 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. మొట్టమొదటిగా తెలుగు యాంకర్ గా శాంతి స్వరూప్ పనిచేశారు. ఇప్పుడు న్యూస్ చదివే యాంకర్ కు ప్రంఫ్టర్ ఉంది. అయితే ప్రంఫ్టర్ లేని రోజులలో ఎలాంటి తప్పులు లేకుండా బాధ్యతాయుతంగాన్యూస్ చదివి అందరి మన్నలు పొంది నశాంతి స్వరూప్ 2011లో పదవి విరమణ పొందారు.