పాలకుల విధానాల ఫలితంగా ప్రభుత్వ బడులకు ముప్పు ఏర్పడింది.బడిలో చేరే పిల్లల సంఖ్య క్రమేపి తగ్గుతోంది. ప్రభుత్వ విద్యారంగం నెమ్మదిగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడనుంది. ప్రభుత్వ విద్యారంగం ఉంటేనే పేదలకు, బలహీన వర్గాలకు చదువు అందుతుంది. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే కృషి మనం చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు లండ బాబూరావు కోరారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులను కలిసి ఒప్పించండి. బడిఈడు పిల్లలందరిని ప్రభుత్వ బడులలో చేర్పించండి… ఉపాధ్యాయులుగా మన వంతు కర్తవ్యం నెరవర్చలని అన్నారు.పలాస కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ సమావేశంలో జిల్లా అధ్యక్షులు లండ బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుంటేనే నిరుపేదలకు అందించేందుకు విలుకలుగుందన్నారు. రేపటి తరానికి వారసత్వంగా ఇచ్చే ఆస్తి, బడుగు బలహీన వర్గాలకు విద్య అందుబాటులో ఉంటుందని, శాస్త్రీయ అవగాహన, చారిత్రక అంశాలతో కూడినటువంటి విద్యను అందించాలని తెలియజేసారు.. ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడానికి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శి రమేష్, స్థానిక మండల ప్రధాన కార్యదర్శి సిద్దేశ్వర రావు, మందస మండల ప్రధాన కార్యదర్శి దాసరిశ్వరావువులు పాల్గొన్నారు