
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజ్యంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం చారిత్రక పోరాటం చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు డాక్టర్ వై శివ కోరారు.ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్రను హైదరాబాదులోని నెల్లి లక్ష్మీనారాయణ గన్ పార్క్ నుండి ప్రారంభించారు.ముదిరాజులను బీసీ- డి నుండి బీసీ-ఏ లోకి మార్చాలి . కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అందులో ముదిరాజులకు రాజ్యాధికారంలో రావాల్సిన వాటా ను కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ముదిరాజు జనాభా అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలోని నియోజక వర్గాలలో బస్సు యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం లో ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ముదిరాజ్ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ వై శివ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రకు సంఘీభావం ప్రకటించారు.కాంగ్రెస్ ప్రకటించిన విధంగా బీసీ-డిలో ఉన్న ముదిరాజ్‌ల రిజర్వేషన్లను బీసీ-ఏలోకి మార్చాలని కోరారు. ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల నిధులు ఇవ్వాలని, చెరువులు, కుంటలపై సంపూర్ణ హక్కులను కల్పించాలని, మత్స్యకారులకు సబ్సిడీపై రుణాలివ్వాలని కోరారు. ముదిరాజు హక్కుల కోసం దశాబ్ద కాలం క్రితం ఉదృతంగా పోరాటం జరిగిన ఆ తర్వాత స్తబ్దత నెలకొంది. తాజాగా సెంట్రల్ యూనివర్సిటీ రిచేర్చ్ స్కాలర్ డాక్టర్ వై శివ ముదిరాజ్ తెలుగు భాష పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేశారు. సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ముదిరాజ్ చైతన్య యాత్ర పేరుతో నిర్వహిస్తున్న బస్ యాత్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు వివిధ పార్టీల్లో ఉన్న ముదిరాజు కులానికి చెందిన నాయకులు ఉద్యమాలు చేపట్టేవారు తాజాగా విద్యావేత్తగా ఉన్న శివ స్వచ్ఛందంగా ముదిరాజ్ హక్కుల కోసం బస్సు యాత్ర చేపడుతుండడంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.