రాయదుర్గం ఐటీ కారిడార్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ఉదయం 6.5గంటల ప్రాంతంలో సత్వ ఎలిక్సిర్ భనంలో మంటలు చెలరేగాయి. ఇనార్బిట్ మాల్ ఎదురుగా చుట్టూ సాఫ్ట్వేర్ పరిశ్రమలు.మధ్యలో డిస్టిక్ 150 పేరుతో సత్వ బిల్డింగులో హోటల్ నిర్వహిస్తున్నారు.అర్ధరాత్రి వరకు ప్రైవేట్ పార్టీ జరిగింది. మద్యం సేవిస్తూ సుమారు 80 మంది వరకు ఉన్నారు.ఆ సమయంలో పేలుడు సంభవించి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగేది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.ఆరు అంతస్తుల భవనంలో నాలుగో అంతస్టులో మంటలు చెలరేగాయి.సిలిండర్ పేలడంతోనే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.చుట్టూ ఐటీ పరిశ్రమలు నిర్వహిస్తున్న ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ శబ్దంతో పేలిపోవడంతో సమీపంలో ఉన్న ఐటీ ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు.సమీపంలో ఉన్నా పరిశ్రమలో ఉన్న ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి.ఈ ఘటన రాయిదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది.సత్త్వ బిల్డింగ్ లో డిస్ట్రిక్ట్ 15 హోటల్ సిలిండర్ పేలి ఒక్కసారి గా పేలుడు సంబవించినట్లు ప్రాధమికంగా నిర్దారించారు.సమీపంలో ఉన్న బిల్డింగ్ లో ఉన్న సిబ్బంది అందరూ ఒకసారి గా రోడ్డు పై పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారుఉదయం6.15 గంటలకు ఈ ప్రమాదం సభవించినట్లు గా తెలుస్తుంది. బిల్డింగ్ అద్దాలు పగిలి రోడ్డు పై పడ్డాయి.4 ఫైర్ ఇంజిన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు. పక్కన ఉన్న బిల్డింగ్ లోని అద్దాలు పగిలి పోవడం . సత్యా ఎలిక్సర్ భవనంలోని నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించగా సమీపంలోని పరిశ్రమల ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు.భారీ శబ్దాలతో మంటలుసమీపంలోని సాఫ్ట్వేర్ పరిశ్రమల అద్దాలు పగిలి రోడ్లపై గాజు పెంకులు చెల్లాచెదురుగా పడ్డాయి.భవనాల అద్దాలు పగిలి భారీ ఆస్తి నష్టం సంభవించింది.శనివారం ఉదయం ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం జరగలేదు.