ఎన్ టీ ఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు పలు సేవా నిర్వహించారు.విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు,నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు సామాజిక స్పృహ,సృజనాత్మకత ఆలోచనలు పెంపొడందించే విద్యావిధానం అమలు చేయాలని ఎన్టీల్ ఫౌండేషన్ చైర్మన్ కొంపల్లి సత్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు.జాయింట్ సెక్రటరీ కంది దేవరాజ్ ,సెక్రటరీ మన్నే నర్సింహులు మాట్లాడుతూ ఎన్ టీ ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూన్న సత్యనారాయణ గుప్తాను అభినందించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్ టి ఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ జాయింట్ సెక్రెటరీ కంది దేవరాజుకు సన్మానించారు.
కంది దేవరాజును సన్మానిస్తున్న ఎన్టీఆర్ ఫౌండేషన్ సభ్యులు