
గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగిన సీఎం కప్ 2026 లో చందానగర్ చెందిన హన్సిక మెరిసింది.ముకుల్ టైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన హన్సిక సీఎం కప్ 2026 స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ సాధించింది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హన్సికకు ప్రశంస పత్రం తో పాటు 20000 పారితోషకం అధికారులు అందించారు. ఈ సందర్భంగా హన్సిక నుముకుల్ అకాడమీలొ ఘనంగా సన్మానించారు. ఈ తరం యువత ముఖ్యంగా అమ్మాయిలు టైక్వాండో లో ప్రత్యేక శిక్షణ పొందడం ద్వారా వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కోచ్ కంది ముకుల్ సాయి చెప్పారు.రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.