హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా ఏబీవీపీలో కీలకంగా ఉన్న మహేష్ కు పార్లమెంట్ ఎన్నికల ముందు కిషన్ రెడ్డి ముఖ్య బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు చేయడంతో పాటు సామాజిక చైతన్యం, విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోరాటం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నామని మహేష్రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, హెడ్ క్వార్టార్ ఇన్చార్జిగా జోడు పదవులు దక్కాయి.పార్లమెంటు ఎన్నికల్లో యువతకు మరింత చేరువ చేయడమే లక్ష్యం గా 77మందితో కొత్త టీంను బిజెపి స్టేట్ ఆఫీస్ సెక్రటరీ డాక్టర్ ఉమాశంకర్ పేరుతో ప్రకటన విడుదల చేశారు.బీజేపీ యూత్ వింగ్ బలోపేతం చేసేందుకు కొత్త టీం కీలకం కానుంది. బీజేవైఎం ప్రెసిడెంట్ గా ఇప్పటికే సెల్వం మహేందర్ పేరు ప్రకటించగా76 మందితో యూవ మోర్చా జంబో టీం నియమించారు. శ్యామల ప్రవీణ్ రెడ్డి సహా ముగ్గురు ప్రధాన కార్యదర్శులు..కార్యదర్శులు గా మరో ఎనిమిది మంది ని నియమించారు.
