దళిత జాతిపై మనువాద శక్తులు దాడులు ప్రతిఘటించాలి

వైజాగ్ దళిత ఉద్యమ నేత ఓంకార్
వైజాగ్ దళిత ఉద్యమ నేత ఓంకార్

 అంబేద్కరిజం అంటే పీడిత కులాల మార్గదర్శి,చైతన్య స్ఫూర్తిఅని స్వలాభాల కోసం చేసే నెలవారీ కార్యక్రమాలు కాకూడదని ప్రముఖ అంబెడ్కర్ ఉద్యమ నేత ఓంకార్ ఆన్నారు.చందాల దండడం,తూ తూ మంత్రంగా జయంతులు వర్ధంతి లు చేయడం కాదన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలదండ వేయడం కోసంప్రజల చందాలతో కొనుగోలు చేసిన వాహనం సొంత అవసరాలకు వాడుకోవడం కాదన్నారు.నీలి జెండా దుర్వినియోగం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దాడులు జరిగినప్పుడు బాధితులు పక్షాన నిలబడి చివరి వరకు పోరాటం చేయాలన్నారు. ఆధిపత్య కులాలైన, ప్రభుత్వ పాలకులైన ఎదురొడ్డి పోరాటం చేసే సత్తా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదసం ఐక్య వేదిక సంఘానికి మాత్రమే ఉందని ఓంకార్ చెప్పారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుడు ఓడిపోయాడని గొడవ చేస్తున్నావ్, గోల చేస్తున్నావ్, దాడులు కూడా చేస్తున్నావు……మరి నీ జాతిపై మనువాద శక్తులు దాడులు చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ బహుజనులకు సూటిగా ప్రశ్నించారు.నీకు హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల పైన మనువాద శక్తులు దాడులు చేస్తున్నప్పుడు నువ్వు ఏమైపోయావ్……ఈ దేశ రాజ్యాంగాన్ని తొలగిస్తామని మనువాద శక్తులు భయానక వాతావరణన్ని సృష్టించినప్పుడు ఏ మూల దాగున్నావు నిలదీశారు.రాజకీయ నేతలుఇచ్చే బిర్యానికి, బ్రాందీ సీసా కి ఆశపడి ఈరోజు నీ జాతి పైనే దాడులు చేసేందుకు సిద్ధపడుతున్న నా దళిత సోదరులారా ఇకనైనా కళ్ళు తెరవండి, మీకోసం కాదు మీ భావితరాల భవిష్యత్తు బాగుకోసం ఎదిరోడ్డి నిలబడాలనిఓంకార్ విజ్ఞప్తి చేశారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *