కబ్జాదారుల కుట్రలు బట్టబయలు చేసిన హైడ్రా : కోట్ల విలువ చేసే స్థలం స్వాధీనం

జంగం కుంట్ల లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు
జంగం కుంట్ల లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు

కొండాపూర్ మజీద్ బండ లో రూ. 700 కోట్ల విలువైన చెరువు స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 200 కోట్లు విలువ చేసే జంగం కుంట కబ్జా. కుంట ఆనవాళ్లు లేకుండా మట్టితో నింపిన కబ్జాదారులు… పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు… హైడ్రా రాకతోనైనా కబ్జా ఆగేనా శీర్షికలతో వెలువడిన కథనానికి హైడ్రాధికారులు స్పందించారు. హైడ్రా అధికారి రాజశేఖర్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణకు గురైన చెరువును రక్షించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. సర్వే నెంబర్ 134 లో 2.35 ఎకరాలు విస్తీర్ణంలో జంగం కుంట ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో ఉంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా డిజిటల్ ఎలివేషన్ మోడ్ సర్వే చేయగా మొత్తం నాలుగు ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ మొత్తం స్థలాన్ని స్వాధీనం చేసుకొని చుట్టూ రక్షణ ఏర్పాటు చేశారు. జంగంకుంట ఆక్రమణలు పై హైడ్రా సీరియస్ గా స్పందించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.2.35ఎకరాలు కాదు. ఏకంగా నాలుగు ఎకరాల పైబడి కుంట విస్తరించి ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు.సర్వేనెంబర్ 134 లో పట్టా భూమి అంటూ నమ్మించి కబ్జాదారులు మట్టి పోసి కుంటను చదును చేశారు.తాజాగా బౌన్సర్ లతో కాపలా పెట్టారు.ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధం చేసినా కబ్జాదారులపై పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ అధికారులు పిర్యాదు చేశారు.ఈ నేపధ్యంలోనే జంగంకుంట లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన హైడ్రా అధికారులు పక్కా ప్రణాళికతో కబ్జా నుంచి చెరువును విముక్తి చేశారు. ఇరిగేషన్, హెచ్ఎండిఏ చెరువుల జాబితాలో జంగం కుంట లేకుండా చేశారు. అక్కడ చెరువు ఉన్నట్లు ఆనవాళ్లే లేవని ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారులు చెబుతూ వచ్చారు. తాజా గా డిజిటల్ ఎలివేషన్ మోడ్ సర్వే లో ఏకంగా నాలుగు ఎకరాల పైబడి కుంట విస్తరించి ఉన్నట్లు గుర్తించడం సంచలనంగా మారింది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు జంగం కుంట చెరువు గుర్తించి చెరువుల జాబితాలో చేర్చి పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని భవిష్యత్తులో అన్యాక్రాంతం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మజీద్ బండ గ్రామస్తులు కోరుతున్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *