
వివిధ సందర్భాలలో ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సైబరాబాద్ పోలీసులు బాసటగా నిలిచారు. చోరీకి గురైన రెండు కోట్ల పైబడి విలువ చేసే 800 సెల్ ఫోన్ లో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సైబరాబాద్ క్రైమ్స్ డిసిపి నరసింహ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించి బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈ సమావేశంలో సిసిఆర్బి ఏసిపి కళింగరావు, సిసిఎస్ ఏసిపి శశాంక్ రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, రాజేంద్రనగర్, శంషాబాద్ ,బాలనగర్, మేడ్చల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్, పవన్ రాజు, నరసింహ, డి ఐ వెంకటరెడ్డి లతో కలిసి వివరాలు వెల్లడించారు.చోరీకి గురైన ఫోన్లు అసాంఘికసత్తులు చేతుల్లోకి వెళ్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ ధరకు ఫోన్ దొరుకుతుందని చోరీ చేసిన వాటిని కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. చోరీ సొత్తు అమ్మిన కొనుగోలు చేసిన అవుతుంది. సి ఈ ఐ ఆర్ వెబ్సైట్ రాకతో ఫోన్లు చోరీ చేసేవారు కటకటాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. సెల్ఫోన్లో అందుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. దొరకదు అనుకున్న ఫోను పోలీసులు తెచ్చి ఇవ్వడంతో ఆనందానికి అవధులు లేవని పలువురు సంతోషం వ్యక్తం చేశారు సైబరాబాద్ పోలీసులు చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు యూపీఐ చెల్లింపులు జరిపినప్పుడు బయట వ్యక్తులకు పిన్ నెంబర్ కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.సెల్ఫోన్ ద్వారా జరిపే లావాదేవీలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులు ఎట్టి పరిస్థితులను తెరవద్దని కోరారు సెల్ ఫోన్లు ఏ విధంగా రికవరీ చేసింది వివరించారు.
సీఈఐఆర్… దొంగలకు చేతికి బేడీలు
చేతిలో ఉన్న సెల్ ఫోన్ క్షణం కనిపించకపోతే గుండే ఆగిపోయినంత.. విలవిలాడిపోయే రోజులువి. అందులో విలువైన సమచారం, ఫోన్ నంబర్లు, మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, బ్యాంకింగ్ యాప్‌లు ఒకటేమిటి. ఇవన్నీ ఉన్న ఫోన్ చోరీకి గురైతే సర్వం కోల్పోయినట్లు భావిస్తుంటారు. మొబైల్ ఫోన్ పోతే దొరికే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో పరిస్థితులు ఉండవు.ఈసమస్యకు పరిష్కారంగా కేంద్ర టెలికాం విభాగం సరి కొత్త సేవలను తీసుకొచ్చింది. అదే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిడీ రిజిస్ట్రీ (CEIR). ఈ యాప్ సెల్ ఫోన్ వాడకం దారులకు వరం కాగా దొంగలకు చేతికి బేడీలు వేయిస్తుంది.సీఈఐఆర్ (Central Equipment Identity Registry) టెక్నాలజీతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మూడు విడుదలగా 1700 ఫోన్లు రికవరీ చేశారు. తాజాగా 800 ఫోన్లు రికవరీ చేసి సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు.2019లోనే ఈ సేవలను ప్రయోగాత్మకంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. మార్చి 15, 2023 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఈ సీఈఐఆర్ పని చేస్తుంది. ఇందు కోసం దేశంలోని మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్లు, మొబైల్ తయారీ కంపెనీలు సంయుక్తంగాడీవోటీ కస్టమర్లకు సేవలను అందిస్తున్నాయి.
అసాంఘిక కార్యకలాపాలకు….
ఐఎంఈఐ నంబర్ ను రీప్రోగ్రాం చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు తమ అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు.దీన్ని ఆసరాగా చేసుకుని ఐఎంఈఐ నంబర్ క్లోన్ చేయడం ద్వారా నకిలీ ఐఎంఈఐ నంబర్లు ఉన్న ఫోన్లను ఉపయోగిస్తున్నారు.చోరీకి గురైన ఫోన్ల భద్రతతో పాటు, ఐఎంఈఐ నంబర్ క్లోన్ అయ్యే ప్రమాదం జరగకుండా ఉండటానికి సీఈఐఆర్ వెబ్ సైట్ ఉపయోగపడుతోంది.నకిలీ ఐఎంఈఐ నంబర్లు ఉన్న ఫోన్లను కనిపెట్టడం కోసం జీఎస్ఎం అసోసియేషన్ ప్రపంచవ్యాప్త డేటాబేస్ కు కూడా సీఈఐఆర్ కు యాక్సెస్ ఉంది. ఇక నుంచి ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తే చాలు మీ ఫోన్ బ్లాక్ చేయవచ్చు
.